Begin typing your search above and press return to search.

16 ఏళ్ల వయస్సులోనే రేప్‌ కు గురైందట

By:  Tupaki Desk   |   26 Sep 2018 10:59 AM GMT
16 ఏళ్ల వయస్సులోనే రేప్‌ కు గురైందట
X
అమెరికన్‌ నటి - మోడల్‌ - హోస్ట్‌ - ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ పద్మాలక్ష్మి తన టీనేజ్‌ లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను న్యూయార్క్‌ టైమ్స్‌ లో ఒక వ్యాసంగా రాసింది. ఆ వ్యాసంలో పద్మాలక్ష్మి పలు ఆసక్తికర విషయాలను జనాల ముందు ఉంచింది. 16 ఏళ్ల వయస్సులో తాను రేప్‌ కు గురైనట్లుగా ఆ కథనంలో పేర్కొంది. తాను ఎంతో నమ్మిన తన బాయ్‌ ఫ్రెండ్‌ తనను రేప్‌ చేశాడని - తాను అతడిని నమ్మి మోసపోయాను అంటూ రాసింది.

పద్మాలక్ష్మి భారత సంతతికి చెందిన మహిళ అనే విషయం తెల్సిందే. చెన్నైకు చెందిన ఆమె తండ్రి అమెరికా వెళ్లడంతో అక్కడే ఆమె జీవనం మొత్తం సాగింది. 16 ఏళ్ల వయస్సులో ఉన్న సమయంలో స్కూల్‌ ముగించుకుని ఒక స్టోర్‌ లో పార్ట్‌ టైం జాబ్‌ చేసేదాన్ని, అదే సమయంలో తనకు 23 ఏళ్ల ఒక బాయ్‌ పరిచయం అయ్యాడు. అతడితో డేటింగ్‌ లో ఉన్న సమయంలో తను నాపై అఘాయిత్యంకు పాల్పడ్డాడు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం నాకు 8 ఏళ్ల కూతురు ఉంది. ఆమెకు నాకు జరిగిన అనుభవం ఎదురు కాకుండా ఉండేందుకు జాగ్రత్తలు చెబుతూ ఉంటాను. మంచిగా మాట్లాడుతూ ఎవరైనా చెడు ఉద్దేశ్యంతో టచ్‌ చేసినా లేదా ప్రైవేట్‌ పార్ట్‌ లలో టచ్‌ చేసినా కూడా వెంటనే చెప్పాల్సిందిగా నేను తనతో పదే పదే చెబుతూ ఉంటాను. ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే గట్టిగా అరవమని తాను చెబుతున్నాను, నేను చెప్పిన మాదిరిగా అంతా కూడా వారి పిల్లలకు చెప్పుకోవాలని ఆమె సూచించింది.