Begin typing your search above and press return to search.

అయిదుపదుల వయసులో ఈ న్యూడ్‌ షో ఏంటో?

By:  Tupaki Desk   |   4 Jan 2020 7:06 PM IST
అయిదుపదుల వయసులో ఈ న్యూడ్‌ షో ఏంటో?
X
హీరోయిన్స్‌.. మోడల్స్‌ హాట్‌ ఫొటో షూట్స్‌ ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడానికి కారణం సినిమాల్లో లేదా మరే రకంగా అయినా ఆఫర్లు వస్తాయేమో అని. చాలా మందికి ఫొటో షూట్స్‌ కారణంగా ఆఫర్లు వచ్చిన సందర్బాలు ఉన్నాయి. అందుకే ఆఫర్లు లేని వారు కొత్త వారు తమ హాట్‌ ఫొటో షూట్స్‌ ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఉంటారు. కాని అయిదు పదుల వయసు ఉన్న పద్మా లక్ష్మీ తన న్యూడ్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది.

మోడల్‌ గా.. నటిగా.. టీవీ వ్యాఖ్యతగా గతంలో ప్రేక్షకులను అలరించిన పద్మా లక్ష్మి ఈమద్య కాలంలో ఆఫర్లు లేక ఢీలా పడిపోయింది. ఈమె కెరీర్‌ దాదాపుగా ముగిసిందని అంతా భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో పద్మా లక్ష్మి మాత్రం న్యూడ్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాలో హీట్‌ పెచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఈ అమ్మడు ఇంకా బుల్లి తెర లేదా వెండి తెరపై కనిపించే ఆసక్తితోనే ఇలా న్యూడ్‌ ఫొటో షూట్స్‌ ను పోస్ట్‌ చేస్తుందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

అమెరికన్‌ టాప్‌ షెఫ్‌ రియాలిటీ షోకు గతంలో యాంకర్‌ గా వ్యవహరించి ఆకట్టుకున్న పద్మా లక్ష్మి ఇప్పుడు మళ్లీ బిజీ అయ్యేందుకు ఇలా న్యూడ్‌ ఫొటోలను పోస్ట్‌ చేస్తుందంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. అయిదు పదుల వయసులో ఇలా న్యూడ్‌ ఫొటో షూట్‌ లతో సోషల్‌ మీడియాలో హీట్‌ పుట్టించినంత మాత్రాన మళ్లీ ఆఫర్లు ఎలా వస్తాయంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.