Begin typing your search above and press return to search.

గుడ్ న్యూస్ చెప్పిన.. ‘హ్యారీ పొట‌ర్’ చిన్నారి!

By:  Tupaki Desk   |   29 July 2021 1:30 AM GMT
గుడ్ న్యూస్ చెప్పిన.. ‘హ్యారీ పొట‌ర్’ చిన్నారి!
X
హాలీవుడ్ లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో హ్యారీ పొటర్ సిరీస్ ఒక‌టి. అటు న‌వ‌ల‌గా.. ఇటు సినిమాగా కోట్లాది మందిని ఆక‌ట్టుకున్న ఈ సిరీస్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 8 చిత్రాలు వ‌చ్చాయి. ఇవ‌న్నీ ప్ర‌పంచ వ్యాప్తంగా ఆడియ‌న్స్ ను అల‌రించాయి. అయితే.. ఇందులో ప‌ద్మా పాటిల్‌, పార్వ‌తీ పాటిల్ పాత్ర‌ల్లో భారతీయ మూలాలున్న అఫ్సాన్ ఆజాద్, షెఫాలీ చౌద‌రి న‌టించారు.

వీరిలో ప‌ద్మా పాటిల్ తాజాగా సోష‌ల్ మీడియాలో త‌న అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. అదేమంటే.. తాను త‌ల్లిని అయ్యాన‌ని ప్ర‌క‌టించింది. త‌న ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ద్వారా ఈ తీపి క‌బురును పంచుకుంది. ఈ మేర‌కు భావోద్వేగంతో కూడిన క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. ''తల్లికావడం ఎంతో అద్భుతంగా ఉంది. త్వ‌ర‌లోనే తిరిగి వ‌స్తాను. ప్ర‌స్తుతానికి సెల‌వ్‌'' అని పోస్టు చేసింది.

ఈ విష‌యం తెలుసుకున్న ప‌ద్మా పాటిల్ ఫ్యాన్స్ శుభాకాంక్ష‌ల‌తో ముంచెత్తారు. కొత్త జీవితాన్ని ఆనందంగా గ‌డ‌పాల‌ని, మాతృత్వాన్ని అద్భుతంగా ఆస్వాదించాల‌ని ఆకాంక్షిస్తున్నారు. చ‌దువుకుంటున్న స‌మ‌యంలోనే హ్యారీ పొట‌ర్ చిత్రానికి ఎంపికైన ప‌ద్మ‌.. 2018లో న‌బిల్ ఖాజీని వివాహం చేసుకుంది. ఇప్పుడు ఆమె పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.