Begin typing your search above and press return to search.
పద్మావత్.. పదో రోజు ప్రభంజనం
By: Tupaki Desk | 4 Feb 2018 7:22 AM GMTపద్మావత్ సినిమా రిలీజై పది రోజులు దాటింది. అమెరికాలో ఈ చిత్ర ప్రభంజనానికి ఇంకా తెరపడలేదు. రెండో వీకెండ్లో.. రిలీజైన పదో రోజు అక్కడ ఈ సినిమా మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేయడం సంచలనం రేపుతోంది. ఈ వారం విడుదలైన కొత్త సినిమాల్ని కూడా వెనక్కి నెట్టి రెండో శనివారం ఏకంగా మిలియన్ మార్కును దాటడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
యుఎస్ లో ఇప్పటికే ఈ చిత్రం 8 మిలియన్ డాలర్లు వసూలు చేయడం విశేషం. హిందీ సినిమాల్లో ‘దంగల్’ అత్యధికంగా 12 మిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉంది. ‘బాహుబలి: ది కంక్లూజన్’ 21 మిలియన్ డాలర్లతో ఓవరాల్ గా ఇండియన్ సినిమాల్లో రికార్డు నెలకొల్పింది. ఆ రికార్డును ఎవ్వరూ టచ్ చేయలేరు కానీ.. ‘దంగల్’ రికార్డును ‘పద్మావత్’ బద్దలు కొట్టినా కొట్టేయొచ్చు.
మరోవైపు ఇండియాలో సైతం ‘పద్మావత్’ జోరు కొనసాగుతోంది. ‘పద్మావత్’ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు సాగించిన కర్ణిసేన యు టర్న్ తీసుకుని ఈ చిత్రానికి మద్దతుగా నిలిచిన నేపథ్యంలో ఇప్పటిదాకా విడుదల కాకుండా ఉన్న కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ‘పద్మావత్’ థియేటర్లలోకి దిగింది. కాబట్టి రెండో వారాంతపు వసూళ్లు పెరుగుతాయని భావిస్తున్నారు.
ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.300 కోట్ల గ్రాస్ మార్కును అందుకునే అవకాశముంది. ఎన్నెన్నో అడ్డంకుల్ని దాటుకుని.. చివరికి అతి కష్టం మీద విడుదలైన ఈ చిత్రానికి అంతిమంగా మంచి ఫలితం రావడం సంజయ్ లీలా బన్సాలీకి గొప్ప ఊరటనిచ్చేదే. ఐతే ఈ సినిమాకు ఆయన ఎదుర్కొన్న ఒత్తిడి అంతా ఇంతా కాదు. కాబట్టి భవిష్యత్తులో మళ్లీ ఆయన ఇలాంటి వివాదాస్పద కథల జోలికి మాత్రం వెళ్లకపోవచ్చు.