Begin typing your search above and press return to search.

`ప‌ద్మావ‌త్` పై నిషేధం...సుప్రీంలో పిటిష‌న్!

By:  Tupaki Desk   |   17 Jan 2018 10:18 AM GMT
`ప‌ద్మావ‌త్` పై నిషేధం...సుప్రీంలో పిటిష‌న్!
X
బాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలీ భ‌న్సాలీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన `ప‌ద్మావ‌త్` చిత్రంపై పెను దుమారం రేగిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో రాణి ప‌ద్మిని దేవి పాత్ర‌ను వ‌క్రీక‌రించార‌ని, ఆ పాత్రలో నటించిన దీపికా ప‌దుకొణేతో పాటు భ‌న్సాలీకి కూడా తీవ్ర‌స్థాయిలో బెదిరింపులు వ‌చ్చిన విష‌యం విదిత‌మే. ఎట్ట‌కేల‌కు ఈ చిత్రం ఈ నెల 25న విడుద‌ల‌య్యేందుకు సిద్ధ‌మైంది. అయితే, రాజ్ పుత్ వ‌ర్గంతో పాటు మ‌రికొంత‌మంది ప్ర‌జ‌ల నుంచి ఈ చిత్రం విడుద‌లపై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంద‌ని, అందుయే ఆ సినిమాను త‌మ రాష్ట్రాల్లో నిషేధిస్తున్నామ‌ని గుజ‌రాత్‌ - రాజ‌స్థాన్‌ - మ‌ధ్య ప్ర‌దేశ్ - హ‌ర్యానా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ప్ర‌క‌టించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ తో పాటు మ‌రికొన్ని రాష్ట్ర‌ల్లో ఈ చిత్ర విడుద‌ల‌పై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. ఈ నేప‌థ్యంలో చిత్ర‌నిర్మాత‌లు సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు.

'ప‌ద్మావ‌త్' చిత్రం విడుద‌ల పై నిషేధాన్ని చిత్ర నిర్మాత‌లు స‌వాల్ చేశారు. ఈ ప్ర‌కారం వారు సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఆ చిత్ర నిర్మాత‌ల పిటిష‌న్ ను విచార‌ణ చేసేందుకు భారత ప్ర‌ధాన న్యాయ‌మూర్తి దీప‌క్ మిశ్రా అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. ఈ నిషేధం గురించిన పిటిష‌న్ పై గురువారం నాడు విచార‌ణ జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతానికి నాలుగు రాష్ట్రాల్లో నిషేధం విధించార‌ని, అయితే, ఆ ప్ర‌భావం సినిమా క‌లెక్ష‌న్ల పై ప‌డే అవ‌కాశ‌ముంద‌రిన నిర్మాత‌లు భావించారు. దీంతో, విధిలేని ప‌రిస్థితుల్లో వారు సుప్రీం త‌లుపు త‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. గతంలో కూడా కొన్ని రాష్ట్రాలు...కొన్ని చిత్రాల‌పై నిషేధం విధించిన త‌ర్వాత‌....సుప్రీం ఆదేశాల ప్ర‌కారం యథావిధిగా విడుద‌ల చేసిన ఘ‌ట‌నలున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు త‌మ‌కు అనుకూలంగా వ‌స్తుంద‌ని నిర్మాత‌లు ధీమాగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.