Begin typing your search above and press return to search.
నిహారిక పెళ్లి ముచ్చట్లు పంచుకున్న పద్మజ
By: Tupaki Desk | 13 Dec 2020 7:50 AM GMTమెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మెగా ఫ్యామిలీ అంత కూడా హాజరు అయ్యి కొత్త దంపతులను ఆశీర్వదించారు. రాజస్థాన్ లో ఉదయ్ పూర్ లో పెళ్లి వేడుక ఆపై హైదరాబాద్ లో రిసెప్షన్ వైభవంగా జరిగింది. పెళ్లి తంతు అంతా పూర్తి అవ్వడంతో అది సూపర్ సక్సెస్ అవ్వడంతో నాగబాబు ఫ్యామిలీ చాలా చాలా సంతోషంగా ఉన్నట్లుగా వారి మాటలను బట్టి అర్థం అవుతుంది. నిహారిక అమ్మగారు పద్మజ మాట్లాడుతూ ఆనందంతో కన్నీరు వచ్చాయంటూ పెళ్లికి సంబంధించిన ముచ్చట్లను చెప్పారు.
పెళ్లి మూడు రోజులు ఉండగా నాకు విపరీతమైన జ్వరం వచ్చింది. టెన్షన్ తో నేను ఏం చేయాలేక పోయాను. పెళ్లి పనులు అన్ని కూడా దగ్గరుండి మరీ నాగబాబు గారు మరియు వరుణ్ చూస్తున్నారు. పెళ్లి దగ్గర పడుతున్నా కొద్ది నిహారికలో ఆనందం కలిపించడంతో మేము అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాం. నిహారిక పెళ్లికి ముందు నా నిశ్చితార్థం చీర కట్టుకుంది. ఆ సమయంలో నేను భావోద్వేగానికి గురి అయ్యాను. నాగబాబు గారు కూడా ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. ఆ సమయంలో మేము మధురానుభూతికి లోనయ్యాం
ప్రతి అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతురు పెళ్లిని తమ స్థాయిలో బాగా చేయాలని భావిస్తారు. మేము కూడా నిహారిక పెళ్లిని బాగా చేయాలని అనుకున్నాం. అనుకున్నట్లుగానే చాలా బాగా పెళ్లిని చేశామని మేము అనుకుంటున్నాం. నిహారిక పెళ్లి అయ్యి అత్తవారింటికి వెళ్లినా కూడా నాకు చిన్న పిల్లనే అని.. తన గురించి ఎప్పుడు నాకు చిన్న పిల్ల అనే ఆలోచన ఉంటుందని పద్మ అన్నారు. పెళ్లి సమయంలో వరుణ్ తేజ్ చాలా బాధ్యతతో వ్యవహరించి అన్ని పనులు చూసుకున్నాడు అంటూ కొడుకు పై కూడా పద్మజ ప్రశంసలు కురిపించారు.