Begin typing your search above and press return to search.
ఆకట్టుకుంటున్న ప్యాడ్ మ్యాన్
By: Tupaki Desk | 10 Feb 2018 7:07 AM GMTసందేశాత్మక చిత్రాలు.. నిజజీవిత కథలను తీయడానికే అక్షయ్ కుమార్ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాడు. ‘ఎయిర్ లిఫ్ట్’, ‘రుస్తుం’, ‘టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్‌కథా’ చిత్రాలన్నీ కూడా ఆ కోవకు చెందినవే. అదే వరసలో విడుదలైంది ప్యాడ్ మ్యాన్. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రస్తుతానికైతే పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.
ప్యాడ్ మ్యాన్ కథ తమిళనాడుకు చెందిన అరుణాచలం అనే వ్యక్తిది. సినిమాలో మాత్రం మధ్యప్రదేశ్ నేపథ్యాన్ని తీసుకున్నారు. అరుణాచలం పేరును కూడా మార్చారు. మిగతా కథంతా ఆయన జీవిత కథే. ధియేటర్లలో ఉన్న ప్రేక్షకులను కథ తనవైపుకు లాక్కునేలా దర్శకత్వం చేశారు బల్కీ. అందుకే ప్యాడ్ మ్యాన్ కథే హీరో, అక్షయ్ కాదు అని చెప్పొచ్చు. అయినా సరే అక్షయ్ నటన కూడా సినిమాకే ప్లస్సే. ఇక రాధికా ఆప్టే సగటు ఇల్లాలిగా మెప్పించింది. సోనమ్ కపూర్ తనకిచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేసిందంటున్నారు విమర్శకులు. సినీ విమర్శకులు సైతం... ప్యాడ్ మ్యాన్ చూడమని ప్రత్యేకంగా రికమెండ్ చేస్తున్నారు. దీనిని సినిమాలా కాదు... మహిళల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యతగా తీసుకోవాలి. అందుకే ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది అంటున్నారు విమర్శకులు.
ఇప్పటికీ శానిటరీ నాప్‌కిన్స్ బహిరంగంగా కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు మహిళలు. ఇది సిగ్గు పడే విషయం కాదని మహిళలకు.. ఎగతాళి చేసి వెకిలిగా నవ్వే అంశం కాదని పురుషులకు.. చెబుతున్న చిత్రం 'ప్యాడ్ మ్యాన్' అని కూడా అనుకోవచ్చు. ఈ విషయాన్ని ప్యాడ్ మ్యాన్ హీరో చాలా సున్నితంగా చెప్పాడు. తొలిరోజున ఇండియాలో 10 కోట్లను వసూలు చేసిన ప్యాడ్ మ్యాన్.. శనివారం నుండి మరింత స్ర్టాంగ్ అయిపోయే ఛాన్సుంది.