Begin typing your search above and press return to search.
పద్మావతి పెర్ఫామెన్స్ ఎలా ఉందంటే
By: Tupaki Desk | 28 Jan 2018 4:15 AM GMTసంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో నటించిన పద్మావత్ చిత్రం.. ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. రిలీజ్ కి ముందు చాలానే అంచనాలను సృష్టించిన ఈ చిత్రంపై.. బాహుబలి2ని దాటేస్తుందనే ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. అయితే.. తొలి రోజు వసూళ్ల విషయంలో పద్మావత్ చాలానే వెనుకపడిపోయింది.
నాలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కాని దెబ్బతో 18 కోట్లకే ఫస్ట్ డే నెట్ వసూళ్లు పరిమితమయ్యాయి. కానీ రెండో రోజు మాత్రం పద్మావత్ బాగా పుంజుకుంది. ఈ సినిమా ఏకంగా 30 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టేసింది. వీకెండ్స్ లో మరింతగా ఈ సినిమా వసూళ్లు పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే మౌత్ టాక్ కూడా పద్మావత్ కు లభిస్తోంది. ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ ను ఇప్పుడప్పుడే అంచనా వేయడం చాలా కష్టమైన విషయమే. అయితే.. ఏ మాత్రం ప్రచారం లేకుండానే విడుదల అయిన ఈ సినిమా.. వీకెండ్ ముగిసేలోగానే ఇండియాలోనే 100 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ జనాలు అంచనా వేస్తున్నారు.
మన దేశఁలో రూపొందిన అద్భుతమైన చిత్రాల్లో పద్మావత్ కూడా ఒకటి అనే గుర్తింపు లభించడం ఈ చిత్రానికి సానుకూలంగా చెప్పవచ్చు. దీపికాతో పాటు షాహిద్ కపూర్.. రణవీర్ సింగ్ ల నటన.. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.