Begin typing your search above and press return to search.
'కరోనా క్రైసిస్ ఛారిటీ' కి విరాళం ప్రకటించిన మహేష్ బాబు సోదరి
By: Tupaki Desk | 8 April 2020 1:40 PM GMTకరోనా వైరస్ మహమ్మారి పై పోరాటంలో భాగంగా తీసుకుంటున్న చర్యలకు తమ వంతు సాయం అందించడానికి పలువురు రాజకీయ మరియు సినీ ప్రముఖలు ముందుకొస్తోన్న సంగతి తెలిసిందే. సమాజం నుండి మనం తీసుకోవడమే కాదు.. ఆ సమాజానికి ఏదైన కష్టం కలిగితే తమ వంతు సాయం చేయడానికి కూడా ముందుకు రావాలి. ఇపుడు మన సెలబ్రిటీలు కూడా అదే చేస్తున్నారు. ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి తమ ఔదార్యాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు తమ వంతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం అందిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో రోజువారీ వేతనానికి పనిచేసే కార్మికులను ఆదుకోవడానికి 'కరోనా క్రైసిస్ ఛారిటీ' ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ఛారిటీకి సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులందరూ తమకు తోచిన విధంగా సహాయం చేస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి - ఎంపీ గల్లా జయదేవ్ భార్య గల్లా పద్మావతి.. సినీ కార్మికుల సహాయార్థం కరోనా క్రైసిస్ ఛారిటీకి రూ.10 లక్షల విరాళం అందజేసి కరోనా పై యుద్ధానికి మేము సైతం అంటూ ముందుకొచ్చారు. అమరరాజా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై జయదేవ్ దంపతులు కుమారుడు అశోక్ గల్లాను హీరోగా పరిచయం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా అమరరాజా ఇండస్ట్రీస్ ఎంటర్ టైన్ మెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇదిలా ఉండగా ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ ఎన్ సీసీ) తరఫున 25 లక్షల రూపాయలను తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. ఎఫ్ ఎన్ సీసీ తరఫున ఘట్టమనేని ఆదిశేషగిరిరావు - కె.ఎస్.రామారావు తదితరులు చెక్ ను మంత్రి కేటీఆర్ కు అందజేశారు. ఇప్పటికే సినీ పరిశ్రమ నుంచి చాలా మంది ప్రముఖులు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీగా విరాళాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.