Begin typing your search above and press return to search.

పద్మావతికి కామసూత్రతో లింక్ పెట్టారే

By:  Tupaki Desk   |   1 Feb 2017 6:07 PM GMT
పద్మావతికి కామసూత్రతో లింక్ పెట్టారే
X
దీపికా పదుకొనే లీడ్ రోల్ లో షాహిద్ కపూర్.. రణవీర్ సింగ్ లు నటిస్తున్న పద్మావతి చిత్ర యూనిట్ పై.. రాజస్థాన్ లో రాజ్ పుత్ కర్ణి సేన దాడి చేసి ఆరు రోజులు జరిగిపోయింది. ఇన్నాళ్లకు కూడా కనీసం కేసు కూడా బుక్ చేయలేదంటే.. ఇక్కడి ప్రజల మనోభావాలకు.. ప్రభుత్వం ఎలాంటి సపోర్ట్ ఇస్తుంందో అర్ధం చేసుకోవచ్చు.

రాజస్థాన్ లో సినిమాల చిత్రీకరణకు మొగ్గు చూపడానికి కారణం.. అక్కడి సుందర నిర్మాణాలు.. పరిస్థితులు. కానీ రాజస్థాన్ లో షూటింగ్ అంత తేలిక కాదు. అధికారుల నుంచి.. స్థానిక పెద్దల నుంచి అనుమతులు తీసుకోవాలి. స్క్రిప్ట్ అంతా వారికి చెబితే.. వారికి నచ్చితే అప్పుడు షూటింగ్ కి అనుమతి ఇస్తారు. 1996 లో కామసూత్ర-ఏ టేల్ ఆఫ్ లవ్ స్టోరీ విషయంలో దర్శకురాలు మీరానాయర్.. ఓ టెక్నిక్ పాటించారని ఆ ప్రొడక్షన్ యూనిట్ మెంబర్ ఒకరు చెబుతున్నారు. అసలు సినిమా పేరు చెప్పకుండా.. ప్రాజెక్ట్ 5 అనే టైటిల్ తో అక్కడ షూటింగ్ పూర్తి చేసేశామని అన్నాడు.

రిలీజ్ సమయంలోనూ గొడవలు జరిగినా.. అవేవీ షూటింగ్ సమయంలో జరిగేటంతటి తీవ్రంగా ఉండవని అంటున్నారు. ఇప్పటికే రాజ్ పుత్.. హిందూ సేనలు చాలా సినిమాలనే అడ్డుకున్నారు. మాధురీ దీక్షిత్ తో ఎంఎఫ్ హుస్సేన్ తీసిన 'మీనాక్షి ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్' ని అడ్డుకునేందుకు కారణం దర్శకుడు ముస్లిం కావడమే. రాకేష్ ఓం ప్రకాష్ తీసిన 'ఢిల్లీ6'.. 2013లో 'మై ఔర్ ఛార్లెస్'.. ఇలా చాలా సినిమాలనే రాజ్ పుత్ వాసులు అడ్డుకుంటున్నా.. అక్కడి హిందూ సేనల జోలికి రాజస్థాన్ ప్రభుత్వం వెళ్లే ధైర్యం చేయదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/