Begin typing your search above and press return to search.
'పద్మావతి' కోసం 400 కేజీల మేలిమి బంగారం!
By: Tupaki Desk | 13 Oct 2017 1:54 PM GMTప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న 'పద్మావతిస చిత్రంపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. సెలబ్రిటీలతో సహా ప్రతి ఒక్కరూ ఈ చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. బాహుబలి తర్వాత మరో విజువల్ గ్రాండీర్ చూడడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అయితే, హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం టెక్నీషియన్లు, డిజైనర్లు, దర్శకనిర్మాతలు చాలా కష్టపడ్డారట. 13వ శతాబ్దం కాలం నాటి ఒరిజినల్ లుక్ కోసం గిల్ట్ నగలు కాకుండా అసలు సిసలు మేలిమి బంగారు ఆభరణాలు వాడారట. ఈ చిత్రం కోసం అవసరమైన 400 కేజీల బంగారాన్నిఅందజేసేందుకు తనిష్క్ జ్యూవెలరీస్ తో ఒప్పందం చేసుకున్నారట. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘పద్మావతి' టీం ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఇందులో వాడిన ఆభరణాల కోసం దాదాపు 200 మంది క్రాఫ్ట్ మెన్ 600 రోజుల పాటు కష్టపడ్డారు.
14వ శతాబ్దంలో రాణి పద్మావతి, ఆమె భర్త రావల్ రతన్ సింగ్ పరిపాలిస్తోన్న చిత్తోర్ కోటను అల్లా ఉద్దీన్ ఖిల్జీ ఆక్రమించిన సందర్భంగా జరిగిన ఘటల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చరిత్ర ప్రకారం అల్లా ఉద్దీన్ ఖిల్జీ ....కోటను స్వాధీనం చేసుకుని రావల్ రతన్ సింగ్ ను చంపేస్తాడు. ఆ సమయంలో పద్మావతితో పాటు కోటలోని మహిళలందరూ అగ్నిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటారు. ఆ ఘట్టాన్ని చిత్రంలో యథాతధంగా చూపించబోతున్నారని తెలుస్తోంది. ‘పద్మావతి'గా టైటిల్ రోల్ చేస్తున్న దీపిక పదుకోన్ కెరీర్లో ఇది ఉత్తమ చిత్రం అవుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అల్లా ఉద్దీన్ ఖిల్జీ పాత్రలో రణవీర్ సింగ్, పద్మావతి భర్త మహా రావల్ రతన్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణవీర్ సింగ్, దీపిక పదుకోన్ కలిసి నటించడం ఇది మూడో సారి. గతంలో వారు రామ్-లీలా, బాజీరావు మస్తానీ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.