Begin typing your search above and press return to search.
పద్మావతి.. మళ్లీ మెస్మరైజ్ చేసింది
By: Tupaki Desk | 11 Nov 2017 2:30 PM GMTఈ ఏడాదిలో ఇక ఇండియాలో మిగిలిన అతి పెద్ద సినిమాలు రెండు. అందులో ఒకటి ‘పద్మావతి’ కాగా.. ఇంకోటి ‘టైగర్ జిందా హై’. ఐతే వీటిలో ఎక్కువ ఎగ్జైట్మెంట్ కలిగిస్తున్నది.. దేశం మొత్తం దృష్టిని ఆకర్షిస్తున్నది ‘పద్మావతి’ సినిమానే. దీని చుట్టూ నెలకొన్న వివాదాలు.. కళ్లు చెదిరిపోయేలా చేసిన ట్రైలర్ వల్ల దీనికి మంచి ప్రచారం లభించింది. జనాల్లో ఈ సినిమాపై విపరీతమైన ఆసక్తి ఏర్పడింది.
ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విశేషమూ జనాల్ని ఆకట్టుకుంటోంది. కొన్ని రోజుల కిందటే ‘పద్మావతి’ సినిమాలోని ఒక పాటను రిలీజ్ చేయగా.. అది సినీ ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో పాటను లాంచ్ చేశారు. ఏక్ దిల్.. ఏక్ జాన్ అంటూ సాగే ఆ పాట ఇన్ స్టంట్ గా హిట్టయిపోయింది. తొలి పాటలో తన డ్యాన్స్ తో మెస్మరైజ్ చేసిన దీపికా పదుకునే.. ఈ పాటలో రొమాన్స్ పండించడంలో తన ప్రావీణ్యాన్ని చూపించింది.
ఈ పాటకు షాహిద్-దీపికల కెమెస్ట్రీనే హైలైట్. పాటల చిత్రీకరణలో.. రొమాన్స్ విషయంలో సంజయ్ లీలా బన్సాలీ ముద్ర కూడా ఈ పాటలో కనిపిస్తోంది. ఈ చిత్రం విడుదల ఆపేయాలంటూ వేసిన పిటిషన్లన్నింటినీ కోర్టు కొట్టేసిన నేపథ్యంలో అనుకున్న ప్రకారమే డిసెంబరు 1న ‘పద్మావతి’ ప్రేక్షకుల్ని పలకరించే అవకాశముంది. ఇందులో రణ్వీర్ సింగ్ అల్లా వుద్దీన్ ఖిల్జీ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతం, నిర్మాత కూడా బన్సాలీనే.