Begin typing your search above and press return to search.

ఆ సినిమా వాళ్లను విడదీసిందా..

By:  Tupaki Desk   |   16 March 2017 7:18 AM GMT
ఆ సినిమా వాళ్లను విడదీసిందా..
X
బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో రణవీర్ సింగ్.. హాలీవుడ్ వరకూ వెలిగిపోతోన్న దీపికా పదుకొనే.. ప్రేమపక్షులనే విషయం ఎప్పుడో ఓపెన్ అయిపోయింది. గత కొన్ని వారాలుగా మాత్రం వీళ్లిద్దరూ విడిపోయారనే న్యూస్ బాగా హల్ చల్ చేస్తోంది. హోలీ రోజున.. రణబీర్ కపూర్ తో దీపిక హోలీ ఆడుతున్న ఫోటోను షేర్ చేయడం చూసి.. చాలామంది బ్రేకప్ నిజమే అనేసుకున్నారు.

అయితే.. ప్రస్తుతం వీరిద్దరూ దూరందూరంగా ఉంటున్న మాట ఓ యాంగిల్ లో నిజమే. కానీ అదేమీ రియల్ బ్రేకప్ కాదు. ఇదంతా ఓ సినిమా కోసం జరుగుతున్న హంగామా.. చేసుకున్న ఒప్పందం. ప్రస్తుతం వీరిద్దరూ భన్సాలీ తెరకెక్కిస్తున్న పద్మావతి చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో అల్లావుద్దీన్ ఖిల్లీ పాత్రను పోషిస్తున్న రణవీర్ సింగ్ కు.. లొంగిపోయేందుకు నిరాకరించే మహరాణి పాత్ర అయిన రాణి పద్మిని పాత్రలో దీపికా పదుకొనే నటిస్తోంది.

అంటే.. వీళ్లిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడే పాత్రలు అన్న మాట. కేరక్టర్ కు తగినట్లుగా జనాల మూడ్ సెట్ చేసేందుకు.. సినిమా రిలీజ్ అయ్యే వరకు.. బైట ఎక్కడా కలిసి కనిపించకూడదని.. సోషల్ మీడియాలో కూడా అంటీ ముట్టనట్లుగా ఉండాలని డిసైడ్ అయ్యారట దీపికా-రణవీర్. అలా ఈ ప్రేమజంటను ఆ సినిమా విడదీసేసింది. అఫ్ కోర్స్.. తాత్కాలికంగానే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/