Begin typing your search above and press return to search.
బన్సాలీ సినిమా యూనిట్ పై మళ్లీ దాడి
By: Tupaki Desk | 15 March 2017 12:44 PM GMTసంజయ్ లీలా బన్సాలీ కొత్త సినిమా పద్మావతికి ఇబ్బందులు తొలగిపోలేదు. ఇప్పటికే ఒకసారి బన్సాలీ మీద.. యూనిట్ సభ్యుల మీద దాడికి దిగిన కర్ణిసేన కార్యకర్తలు మరోసారి తమ ప్రతాపం చూపించారు. ఈసారి సినిమా సెట్ ని తగలబెట్టేశారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ ప్రాంతంలో భారీ మొత్తంలో ఖర్చు చేసి రూపొందించిన సెట్ ను తగలబెట్టి చిత్ర బృందానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లేలా చేశారు.
పద్మావతి సినిమా ఆరంభమైన నాటి నుంచి కర్ణిసేన కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. తాను చరిత్రను వక్రీకరించి సినిమా తీయట్లేదని.. సినిమా చూడకుండానే.. ఇంకా సినిమా పూర్తి కాకుండానే ఇలా దాడులు చేయడం ఎంత వరకు సమంజసమని బన్సాలీ అంటున్నా ఆందోళనకారులు తగ్గలేదు. మరోసారి దాడి చేసి యూనిట్ సభ్యుల్ని విస్మయానికి గురి చేశారు. పద్మావతి చిత్రంలో రాణి పద్మావతిగా దీపికా పదుకొనే నటిస్తోండగా అల్లావుద్దీన్ ఖిల్జీగా నెగటివ్ రోల్ లో రణ్ వీర్ సింగ్ కనిపించనున్నాడు. రాజా రావల్ రతన్ సింగ్ పాత్రను షాహిద్ కపూర్ పోషిస్తున్నాడు. ఐతే ఈ చిత్రంలో రాణి పద్మిణి.. అల్లావుద్దీన్ ఖిల్జీ మధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్లు చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళనకారులు వాదిస్తున్నారు. చరిత్రను వక్రీకరించి సినిమా తీస్తే సహించబోమని.. 'పద్మావతి' సినిమాలో వారి మధ్య ప్రేమ సన్నివేశాలు ఉన్నట్లు చూపిస్తే ఊరుకోబోమని ఆందోళన కారులు హెచ్చరిస్తున్నారు. ఈ సినిమాను థియేటర్లలోకి కూడా రానివ్వమంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/