Begin typing your search above and press return to search.
ఓటీటీ బాట పట్టబోతున్న పాగల్..?
By: Tupaki Desk | 16 May 2021 2:30 AM GMTకరోనా సెకండ్ వేవ్ విజృంభనతో టాలీవుడ్ లో విడుదల తేదీలను ప్రకటించిన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో తెలుగు రాష్ట్రాలలో లాక్ డౌన్ కూడా పెట్టేశారు. ఈ నేపథ్యంలో థియేటర్స్ మూతబడి పోయాయి. పరిస్థితులు చూస్తుంటే ఇంకో నాలుగు నెలలు థియేటర్స్ తెరుచుకునే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వాయిదా పడిన సినిమాకు డైరెక్ట్ ఓటీటీ రిలీజుల గురించి ఆలోచిస్తున్నాయి.
పెద్ద సినిమాలు కొంత కాలం వేచి చూసే ధోరణిలో ఉన్నా చిన్న సినిమాలు మాత్రం ప్రత్యామ్నాయంగా ఓటీటీల వైపు చూస్తున్నాయి. ఇప్పటికే వాయిదా పడిన కొన్ని సినిమాలు ఓటీటీలలో విడుదల అయ్యాయి. ఈ క్రమంలో 'పాగల్' చిత్రాన్ని కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. 'మాస్ కా దాస్' విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న 'పాగల్' చిత్రాన్ని కొత్త దర్శకుడు నరేష్ కొప్పల్లి తెరకెక్కిస్తున్నారు. ఇందులో నివేదా పేతురాజ్ - సిమ్రాన్ చౌదరి - మేఘ లేఖ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ - లక్కీ మీడియా బ్యానర్స్ పై బెక్కం వేణుగోపాల్ ఈ 'పాగల్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ చివరి వారంలో విడుదల చేయాలనుకున్న ఈ చిత్రాన్ని మే 1వ తేదీకి వాయిదా వేశారు. ఆ తర్వాత కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మరోసారి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు మరో నాలుగు నెలలు థియేటర్లు తెరవరని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని డిజిటల్ రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఈ సినిమాను తీసుకోవడానికి పోటీ పడుతున్నారట. 'పాగల్' చిత్రాన్ని ఏ వేదికపై రిలీజ్ చేస్తారనేది రాబోయే రోజుల్లో క్లారిటీ వస్తుందేమో చూడాలి.