Begin typing your search above and press return to search.
కిస్సింగ్ సీన్ ఉంచి హెల్ప్ చేశారట
By: Tupaki Desk | 23 Nov 2015 5:30 PM GMTసెన్సార్ నిర్ణయాలు ఈ మధ్య ఎక్కువగా వివాదాస్పదం అవుతున్నాయి. దేశీయ సినిమాల్లోనే ఇలాంటివి చాలా ఉదాహరణలు ఉన్నా.. రీసెంట్ గా జేమ్స్ బాండ్ మూవీ స్పెక్టర్ లో ముద్దు సీన్ కి వేసిన కత్తెర.. ఎక్కువగా మాటల్లో నానుతోంది. సెన్సార్ బోర్డ్ చర్యలను పబ్లిక్ గానే విమర్శిస్తున్నారు చాలామంది. ప్రేక్షకులైతే సోషల్ మీడియాలో తిట్టిపోసేస్తున్నారు కూడా. అయితే.. తాము చేసినది కరెక్టే అంటోంది సెన్సార్ బోర్డ్.
గత రెండు బాండ్ చిత్రాల్లోనూ ఒక్క కిస్సింగ్ సీన్ ను కూడా తాము ఉంచలేదని.. కానీ ఈ సారి కొంత ఉదారంగానే వ్యవహిరించామంటున్నారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ఛైర్మన్ పహ్లజ్ నిహలానీ. స్పెక్టర్ లో ముద్దు సీన్ ను ఉంచామని, ఒరిజినల్ తో పోల్చితే కేవలం 30శాతం తక్కువగా ఉంటుందని వివరించారాయన. అయితే.. ఇక్కడో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా చెప్పారు పహ్లజ్. అదేంటంటే.. ఇప్పుడు తాము కొత్తగా రేటింగ్ విధానాన్ని మార్చబోతున్న విషయాన్ని గుర్తు చేసారు. 12 - 12+ - 15 - 15+ - A - A+ - A++ రేటింగులు త్వరలో ఇవ్వనున్న విషయాన్ని గుర్తు చేసి... ఒకవేళ A - A+ - A++ రేటింగులు ఉన్న చిత్రాలను టీవీలో ప్రదర్శించేందుకు అంగీరించబోమన్న సంగతి తెలిపారు.
అంటే ఫక్తు పెద్దలకు మాత్రమే చిత్రాలన్న మాట. వీటిని ఛానల్స్ ప్రదర్శించే అవకాశం ఉండదు. మరి దీనికి నిర్మాతలు అంగీకరిస్తారా అంటూనే.. నిజంగా సినిమాపై నమ్మకం ఉంటే, టీవీ ప్రదర్శనలపై వచ్చే డబ్బులపై ఎందుకు మూవీ మేకర్స్ ఆధారపడుతున్నారని ప్రశ్నించారు సెన్సార్ బోర్డ్ ఛైర్మన్. ఆయన అడిగిన పాయింట్ కూడా కరెక్టే. కాకపోతే ముద్దులపై చేస్తున్న ఆక్షేపణలే కాస్త ఓవర్ గా ఉన్నాయ్. ఒక ముద్దు సీన్ 10 నిమిషాలుంటే ఏంటి.. 10 సెకన్లు ఉంటే ఏంటి.. లెంగ్త్ తగ్గించడం వలన యూజ్ ఏంటి స్వామి?