Begin typing your search above and press return to search.

అది రాసుంటే మేం లీక్ చేసినట్లేనా??

By:  Tupaki Desk   |   11 July 2016 10:11 AM GMT
అది రాసుంటే మేం లీక్ చేసినట్లేనా??
X
గతంలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్లు.. లీకైన ఒక సినిమా వీడియోపై ''ఫర్ సెన్సార్ బోర్డు'' అని రాసుంటే.. దానిని సెన్సార్ వారే లీక్ చేసినట్లు కాదు. ఇప్పుడు అదే విషయంపై మరింత క్లారిటీనిస్తూ వివాదాస్పద సెన్సార్ బోర్డు చీఫ్‌ పంకజ్ నిహ్లానీ స్పందించారు. అప్పట్లో ఉడ్తా పంజాబ్.. మొన్న సుల్తాన్ సినిమాల కాపీలు ఇంటర్నెట్ లో లీకవ్వడం.. వాటిపై సెన్సార్ బోర్డు అనే వాటర్ మార్కు ఉండటంతో.. అసలు ఏం జరుగుతోంది అనే విషయం చెప్పాడానికి ఆయన ముందుకొచ్చారు.

''ఒక నిర్మాత ఒక సినిమాను మాకు చూపించడానికి తీసుకొస్తే.. ఈరోజుల్లో అది డిజిటల్ వెర్షన్ లోనే తెస్తున్నారు. అలా నిర్మాత తెచ్చిన హార్డు డిస్క్ లో ఉన్న సినిమా కావాలంటే మాకు ' సెక్యూరిటీ కీ' (కె.డి.యం.. కీ డెలివరీ మెసేజ్) కావాలి. అది నిర్మాత దగ్గరే ఉంటుంది. వారొచ్చి స్వయంగా ఆ పాస్వార్డు ఎంటర్ చేస్తేనే సినిమా ప్లే అవుతుంది. మా దగ్గర నుండి పైరసీ కాపీ బయటకు వెళ్ళే ఆస్కారమే లేదు. ఎందుకంటే ఆ హార్డు డిస్కులో ఉన్న మూవీ ఫార్మాట్ (జె.పి.ఇ. 2000) ను మనం మామూలు వీడియో ఫైలులా కాపీ చేయలేం'' అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారాయన. ''కేవలం సెన్సార్ బోర్డు అని రాసున్నంత మాత్రాన మేం లీక్ చేసినట్లు కాదు. ఉడ్తా పంజాబ్‌ విషయంలో ఢిల్లీలో కొంతమంది అరెస్టు చేశారు. గ్రేట్ గ్రాండ్ మస్తీ సినిమా విషయంలో కూడా మేం నిర్మాతలతో ఇన్వెస్టిగేషన్‌ కొరకు సహకరిస్తున్నాం'' అన్నారు పంకజ్.