Begin typing your search above and press return to search.

సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీల పెయిడ్ ప్రమోషన్స్...!

By:  Tupaki Desk   |   31 July 2020 12:10 PM GMT
సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీల పెయిడ్ ప్రమోషన్స్...!
X
సెలబ్రిటీలు, సినీ స్టార్స్ చాలామంది సినిమాలతోనే కాకుండా బ్రాండ్ ప్రమోషన్స్ కూడా చేస్తూ సంపాదిస్తారనే విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో తమకున్న క్రేజ్ ని వాడుకొని అంతో ఇంతో వెనకేసుకోవాలని చూస్తుంటారు. ఈ నేపథ్యంలో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి వెళ్లడంతో పాటు కొన్ని ప్రైవేట్ ఈవెంట్స్ కి కూడా అటెండ్ అవుతుంటారు. అయితే ఇప్పుడు డిజిటల్ యుగంలో సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. అయితే కొంతమంది హీరోహీరోయిన్లు ఆన్లైన్ జూదాలను ఎంకరేజ్ చేసే యాప్స్ ని కూడా ప్రమోషన్స్ ఇస్తున్నారు. దీనిపై వారి అభిమానుల నుంచి వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో కొంతమంది మాత్రం ప్రజలకు నష్టాన్ని కలిగించే బ్రాండ్స్, ప్రొడక్ట్స్ మరియు యాప్స్ కి ప్రచారం చేయడానికి ఇష్టపడటం లేదు. తమ సినిమాల్లో సైతం అలాంటివి లేకుండా చూసుకుంటున్నారు.

కాగా ఇప్పుడు యువ హీరోలు మెక్ డొనాల్డ్స్ విస్కీ బ్రాండ్ ని సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రమోట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. సూపర్ స్టార్ యారీ అంటూ తమ ఫ్రెండ్స్ తో కలిసి ఫ్రెండ్సిప్ ని గుర్తు చేసుకుంటూ బ్రాండ్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఇటీవల హీరో సుధీర్ బాబు తన ఫ్రెండ్ విజయ్ చల్లాతో కలిసి మెక్ డొనాల్డ్స్ విస్కీ బాటిల్ ఉన్న పిక్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసారు. ఈ క్రమంలో లేటెస్టుగా యువ హీరో నవదీప్ కూడా తన ఫ్రెండ్ తో కంపెనీని ఒరిజినల్ సూపర్ స్టార్ మెక్ డొనాల్డ్స్ అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. అయితే డైరెక్ట్ గా వీటికి ప్రచారం చేస్తే లీగల్ ఇష్యూస్ వస్తాయని.. ఇలా ఇండైరెక్ట్ గా ప్రమోట్ చేస్తున్నారని తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్నప్పటికీ ఫ్రెండ్స్ షిప్ పేరుతో ఆల్కాహాల్ ప్రమోట్ చేయడం ఏమీ బాగాలేదని వారి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.