Begin typing your search above and press return to search.

‘పైసా వసూల్’ అప్పుడొచ్చి ఉంటేనా..?

By:  Tupaki Desk   |   7 Sep 2017 8:58 AM GMT
‘పైసా వసూల్’ అప్పుడొచ్చి ఉంటేనా..?
X
‘పైసా వసూల్’ ముందు అనుకున్న ప్రకారమైతే దసరా కానుకగా సెప్టెంబరు 29న రావాల్సింది. ఐతే అనూహ్యంగా నాలుగు వారాలు ముందుకు తీసుకొచ్చి సెప్టెంబరు 1న రిలీజ్ చేశారు. బాలయ్య-పూరి కాంబినేషన్ చూసి భయపడి.. ఆ రోజు రావాల్సిన ‘జవాన్’ను వాయిదా వేసేశారు. ఇప్పుడు ‘పైసా వసూల్’ పరిస్థితి చూస్తుంటే ‘జవాన్’ యధావిధిగా రిలీజైనా పెద్ద ఇబ్బందేమీ ఉండేది కాదని స్పష్టమవుతోంది.

ఒక వేళ ‘పైసా వసూల్’ ఇప్పుడు కాకుండా ముందు అనుకున్నట్లే సెప్టెంబరు 29న వచ్చి ఉంటే పరిస్థితి ఏంటి అన్న చర్చ కూడా నడుస్తోందిప్పుడు. మహేష్ బాబు సినిమా ‘స్పైడర్’ మీద ఎలాంటి అంచనాలున్నాయో తెలిసిందే. ఆ సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ‘పైసా వసూల్’ మటాష్ అయిపోయేదే. ఇప్పుడు కాబట్టి కనీసం ఓపెనింగ్స్ అయినా బాగా వచ్చాయి. నెలాఖర్లో వస్తే ‘స్పైడర్’ దెబ్బకు కుదేలయ్యేదేమో. దాదాపు నెల రోజులు ముందు రావడం వల్ల కనీసం నిర్మాతకు ఫైనాన్స్ వడ్డీలైనా మిగిలాయి.

ప్రస్తుతం ‘పైసా వసూల్’ పరిస్థితి చూస్తుంటే.. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.20 కోట్ల షేర్ అయినా వస్తుందా అన్నది సందేహంగానే కనిపిస్తోంది. నాలుగు రోజుల్లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ.15 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. వీకెండ్ దాటగానే ఈ సినిమా వీక్ అయిపోయింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ.32.5 కోట్లకు అమ్మారు. నిర్మాతకు రూ.45 కోట్ల దాకా ఖర్చయినట్లు తెలుస్తోంది. ఐతే థియేట్రికల్ హక్కులకు తోడు శాటిలైట్.. డబ్బింగ్.. డిజిటల్ హక్కులన్నీ కలిపి నిర్మాత అయితే సేఫ్ అయినట్లే కనిపిస్తున్నాడు. మధ్యలో మునిగేది బయ్యర్లే.