Begin typing your search above and press return to search.
పైసా వసూల్ ఆడియో ఫంక్షన్ వెన్యూ ఇదే!
By: Tupaki Desk | 1 Aug 2017 12:12 PM GMTటాలీవుడ్ లో వేగంగా సినిమాలు తీసే దర్శకుడు పూరీ జగన్నాథ్, నందమూరి నటసింహం బాలకృష్ణ ల కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం పైసా వసూల్. ఆ ఇద్దరు మాస్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడంలో ఎవరికి వారే సాటి. దీంతో, ఆ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ నిర్మాతలు అనుకున్న దానికంటే నెల ముందే పూరీ సినిమాను పూర్తి చేసేయడంతో ఈ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. పైసా వసూల్ స్టంపర్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది.
దీంతో, ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కోసం అభిమానులు చాలా ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆడియో వేడుకను ఆగస్టు 17వ తేదీన ఖమ్మంలో నిర్వహించనున్నారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకకు ఖమ్మంలోని ఎస్. ఆర్. అండ్ బి.జి.ఎన్.ఆర్ కాలేజ్ గ్రౌండ్ వేదిక కానుంది. తాజాగా ఆడియో రిలీజ్ కు సంబంధించిన స్పెషల్ పోస్టర్లు కూడా విడుదలయ్యాయి. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చాడు. అనుప్ సంగీతం బాలకృష్ణ అభిమానులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో వేచి చూడాలి. గతంలో రెండు సార్లు బాలయ్య అమరావతిలో ఫంక్షన్లు నిర్వహించిన విషయం తెలిసిందే. కానీ...ఈసారి వెరైటీగా ఖమ్మం పయనమవుతున్నాడు.