Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: తేడా సింగ్ వసూల్ ఇదే
By: Tupaki Desk | 17 Aug 2017 4:24 PM GMTఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ''పైసా వసూల్'' ట్రైలర్ వచ్చేసింది. పూరి జగన్ డైరక్షన్లో రూపొందిన ఈ సినిమాలో.. డైలాగులన్నీ కలిపి ఒక ఆడియో సిడి చేసుకోవచ్చు అని బాలకృష్ణ చెప్పినట్లు.. ఇప్పుడు ట్రైలర్ చూస్తే ఆ విషయం కరక్టే అనిపిస్తోంది. పదండి ఎలా ఉందో చూద్దాం.
'నా పేరు తేడా సింగ్. ధిమాక్ తోడా. చాలా తేడా' అంటూ శత్రువుల్ని ఉసిగొల్పి మరీ కొట్టేసే రకం బాలయ్య. ఇక ఒక సరైనోడి కోసం వెతుకుతున్న ఒక మాఫియా టీమ్ కు .. మనోడు దొరుకుతాడు. ఒక పని అప్పగిస్తారు. ఆ పనిలో భాగంగా వరుసపెట్టి రౌడీలను మాఫియా గ్యాంగులను చంపుతూనే ఉంటాడు. గన్ను వాడతాడు. కత్తి దూస్తాడు. తాట తీస్తాడు. పంచు డైలాగులు కూడా పేలుస్తాడు. ''గొడవల్లో గోల్డ్ మెడల్ వచ్చినోడ్ని.. మళ్ళీ టోర్నమెంట్స్ పెట్టొద్దు'' అంటూ వార్నింగ్ ఇస్తూనే.. బాలయ్య చాలా ఎనర్జీతో ఫైట్లు.. యాక్షన్ సీన్లు చేసిన తీరు బాగుంది. ఇక శ్రీయ మరియు ముస్కాన్ లు బ్యూటిఫుల్ గా ఉంటే.. కైరా దత్ ఆ ఐటెం సాంగులో అందాలతో విందు చేసింది.
అనూప్ మ్యూజిక్ పర్లేదు. సినిమాటోగ్రాఫర్ ముకేష్ మాత్రం భలే కలర్ ఫుల్ గా తీశాడు. అలాగే భవ్య క్రియేషన్స్ వారు కూడా ప్రొడక్షన్ వాల్యూస్ తో అదరగొట్టేశారు. మొత్తానికి ఈ ట్రైలర్ చూస్తే పూరి అండ్ బాలయ్య కలసి బి అండ్ సి ఫ్యాన్స్ ను గట్టిగా టార్గెట్ చేశారనే అనుకోవాలి. పైగా హాలిడే సీజన్లో ఇలాంటి డైలాగులతో బాంబులు పేలుస్తుంటే.. ఫ్యాన్స్ మాత్రం చప్పట్లు కొట్టడం విజిల్స్ వేయడం తప్పించి ఏం చేస్తారు. సెప్టెంబర్ 1న పైసా వసూల్ కు రెడీ అవుతున్నాడు తేడా సింగ్!!