Begin typing your search above and press return to search.
పాక్ ప్రభుత్వం డెసిషన్..పాక్ సినీ లవర్స్ అన్ హ్యాపీ
By: Tupaki Desk | 8 Aug 2019 4:41 PM GMTపాకిస్తాన్ లో సినిమా ప్రియులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమ దేశం తీసుకున్న చెత్త నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ ప్రభుత్వం జమ్మూ-కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేయడం పట్ల అసహనంతో ఉన్న పాకిస్తాన్ - ఇండియా సినిమాలపై బ్యాన్ విధించింది. నిన్న ఇండియాతో దౌత్య - వాణిజ్య సంబంధాలను తెంచుకుంటున్నట్లు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పాక్ లో భారత రాయబారి అజయ్ బిసారియాను దేశం నుంచి బహిష్కరించింది. ఈ క్రమంలోనే భారత సినిమాలను తమ దేశంలో ప్రదర్శించకుండా నిషేధం విధిస్తున్నట్లు పాకిస్థాన్ తెలిపింది.
అయితే ఈ నిర్ణయం పట్ల పాకిస్తాన్ సినిమా ప్రియులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే పాకిస్తాన్ లో ఎక్కువ సల్మాన్ ఖాన్ - షారుక్ ఖాన్ - అమీర్ ఖాన్ - హృతిక్ రోషన్ సినిమాలతో పాటు బాలీవుడ్ టాప్ హీరోల సినిమాలని ఎక్కువ ఇష్టపడతారు. ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల పాక్ సినీ అభిమానులు, తమకు ఇష్టమైన హీరోల సినిమాలు చూడలేరు. అంతెందుకు మన రాజమౌళి బాహుబలి సైతం అక్కడ సినిమా లవర్స్ మనస్సులు గెలుచుకుంది. ఈ సంతోషానికి ఇప్పుడు వారు దూరం కానున్నారు.
ఇక సినీ అభిమానులతో పాటు - అక్కడి థియేటర్ యజమానులు - డిస్ట్రిబ్యూటర్లు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే పాకిస్తాన్ సినిమా ఇండస్ట్రీలో 70 శాతం ఆదాయం మన దేశ సినిమాల ద్వారానే వస్తుంది. దీంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్లు కూడా నష్టపోతారు. ప్రస్తుతం ఒక్కో బాలీవుడ్ సినిమా పాక్ లో రూ.3 నుంచి 4 కోట్ల వరకూ అర్జిస్తోంది. సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సినిమా రూ.37 కోట్ల కలెక్షన్ తో పాకిస్థాన్ లో టాప్ గా నిలిచింది.
ఇలా కడుపుమంటతో ఇండియాని ఏదో ఇబ్బంది పెడదామని తీసుకుంటున్న చెత్త నిర్ణయాలు రివర్స్ అయ్యి పాకిస్తాన్ కే నష్టం కలిగిస్తున్నాయి. అటు వాణిజ్య సంబంధాలు - ఇటు సినిమాలని ఆపేసి...తన గొయ్యిని తానే తీసుకుంటున్నట్లు ఉంది. మరి చూడాలి పాక్ ఇలా ఎన్ని రోజులు ఇవన్నీ ఆపుకుని ఉంటుందో..?