Begin typing your search above and press return to search.
పాకిస్థాన్.. ఓ మంచిపని చేసిందండోయ్..!
By: Tupaki Desk | 11 Dec 2020 12:30 AM GMTపాకిస్థాన్ భారత్‌కు దాయాది దేశం. భారత్‌లో అంతర్గత ఉగ్రవాదాన్ని పెంచిపోషించడం. సరిహద్దులో ఉగ్రమూకలకు సహకరించడం. మనదేశంలో ఎప్పుడూ ఏదో ఒక అశాంతి రగిల్చడం పాక్‌కు నిత్యకృత్యం. అయితే అటువంటి పాకిస్థాన్ కూడా ఓ మంచిపని చేసింది. బాలీవుడ్‌లో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న దిలీప్‌కుమార్, రాజ్‌కపూర్‌ల పూర్వీకుల ఇళ్లను పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫఖ్తున్వా ప్రావిన్స్ ప్రభుత్వం కొనుగోలు చేయబోతున్నది.
ఈ ఇద్దరు బాలీవుడ్‌లో దిగ్గజనటులు అయితే వీరి పూర్వీకుల గృహాలు పెషావర్‌లో ఉన్నాయి. పెషావర్‌లో .. 1930 ప్రాంతంలో రాజ్‌కపూర్ తాత ఓ హవేలిని కట్టించారు. దేశ విభజన తర్వాత వాళ్ల కుటుంబం ఇండియాకు వచ్చేసింది. కానీ ప్రస్తుతం ఆ ఇళ్లు ఓ ప్రైవేట్ వ్యక్తి చేతిలో ఉంది. అతడు దాన్ని పడగొట్టి కమర్షియల్ కాంప్లెక్స్ కడదామనుకున్నాడు. దీంతో అక్కడి ప్రభుత్వం ఆ వ్యక్తికి రూ. కోటిన్నర చెల్లించి ఇంటిని కోనుగోలు చేస్తున్నది.
ఈ ఇంటిని వారసత్వ సంపదగా గుర్తించనున్నట్టు ప్రకటించింది. దీంతోపాటు వందేళ్ల క్రితం దిలీప్‌కుమార్ పూర్వీకుల కట్టిన ఇంటిని కూడా సుమారు 80 లక్షల రూపాయల పెట్టి కొనుగోలు చేస్తున్నది. ప్రస్తుతం ఈ గృహాలు శిథిలావస్థలో ఉన్నాయి. అయితే ఈ ఇళ్లను పాకిస్థాన్ ప్రభుత్వం కొనుగోలు చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ ఓ మంచి చేస్తున్నదని నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.