Begin typing your search above and press return to search.
సల్మాన్ ను పరిహారం కోరుతున్నాడు
By: Tupaki Desk | 25 July 2015 9:39 AM GMTభజరంగి భాయిజాన్ సినిమా చూసిన వాళ్లెవ్వరూ నవాజుద్దీన్ సిద్ధిఖి పోషించిన చాంద్ నవాబ్ పాత్రను మరిచిపోలేరు. సినిమాలో సల్మాన్, చిన్నారి పాత్రధారి ఎంత హైలైట్ అయ్యారో పాకిస్థాన్ టీవీ రిపోర్టర్ గా సిద్దిఖి కూడా అంతే హైలైట్ అయ్యాడు. సీరియస్ గా ఎమోషన్స్ తో సాగే సినిమాలో ఎంటర్టైన్మెంట్ బాధ్యత మొత్తం సిద్ధిఖీనే తీసుకున్నాడు. అతడి క్యారెక్టర్ భలే హైలైట్ అయింది. ఐతే ఆ పాత్ర కొత్తగా సృష్టించిందేమీ కాదు. నిజంగానే అలాంటి రిపోర్టర్ ఒకరు పాకిస్థాన్ లో ఉన్నాడు. అతడి పేరు చాంద్ నవాబే. సినిమాలో కనిపించే టీవీ ఛానెల్ రిపోర్టింగ్ దృశ్యం కూడా అతడి నిజ జీవితం నుంచి తీసుకున్నదే.
ఓ టీవీ ఛానెల్ కు పని చేసే చాంద్ నవాబ్.. గత ఏడాది ఓ రైల్వే స్టేషన్లో రిపోర్టింగ్ సందర్భంగా కెమెరా ముందు రిపోర్టింగ్ చేయడానికి.. జనాల్ని పక్కకు తప్పిస్తూ మాట్లాడటానికి ఎలా ఇబ్బంది పడ్డాడో రికార్డ్ చేసి యూట్యూబ్లో వదిలారు అతడి మిత్రులు. ఆ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాంద్ నవాబ్ పడ్డ ఇబ్బందులు నవ్వు తెప్పించడంతో పాటు అతడిపై జాలి కలిగేలా చేశాయి. ఈ వీడియో స్ఫూర్తితోనే కబీర్ ఖాన్ నవాజుద్దీన్ పాత్రను తీర్చిదిద్దాడు. సినిమాలో తన పాత్రను చూసుకుని చాంద్ నవాబ్ షాకయ్యాడు. ముందు నొచ్చుకున్నా తర్వాత లైట్ తీసుకున్నాడు. ఐతే తన స్ఫూర్తితో పాత్ర పెట్టారు కాబట్టి సల్మాన్ తనకు పరిహారం ఇవ్వాలని అంటున్నాడు నవాబ్. ఐతే ఇదేమీ డిమాండ్ కాదని.. దీనిపై తానేమీ కోర్టుకెక్కనని.. ఐతే తాను పేద కుటుంబానికి చెందిన వాణ్ని కాబట్టి మానవతా దృక్పథంతో ఆలోచించి సల్మాన్ తనకు సాయం చేస్తాడని ఆశిస్తున్నట్లు నవాబ్ తెలిపాడు.