Begin typing your search above and press return to search.

సినిమాలు వద్దన్నాడు.. విడాకులు తీసుకుంది

By:  Tupaki Desk   |   11 March 2017 10:50 AM GMT
సినిమాలు వద్దన్నాడు.. విడాకులు తీసుకుంది
X
అవ్వడానికి పాకిస్థాన్ నటే అయినా ఇండియాలో కూడా మంచి పేరే సంపాదించింది వీణా మాలిక్. ముందు ‘బిగ్ బాస్’ షోతో పాపులారిటీ సంపాదించుకుని.. ఆ తర్వాత బాలీవుడ్ సినిమాల్లో హాట్ హాట్ వేషాలతో పేరు సంపాదించింది వీణా. ఆమె తెలుగులోనూ ‘నగ్నసత్యం’ అనే ఒక సినిమా చేసిన సంగతి తెలిసిందే. ముంబయిలో ఉన్నంత కాలం ఏదో ఒక వివాదంలో వేలు పెడుతూ వచ్చిన వీణ.. మూడేళ్ల కిందటే సడెన్ గా పెళ్లి చేసుకుని పాకిస్థాన్లో సెటిలైపోయింది. కానీ ఆమె పెళ్లి ఎంతో కాలం నిలవలేదు.

తన భర్త ఖట్టక్ నుంచి ఆమె మూడు నెలలుగా దూరంగా ఉంటోంది. ఆల్రెడీ వీణ విడాకుల కోసం కూడా అప్లై చేసింది. దీంతో లాహోర్ కోర్టు అతడికి నోటీసులు ఇచ్చింది. ఖట్టక్ రిప్లై ఇవ్వలేదు. కోర్టుకూ హాజరు కాలేదు. దీంతో కోర్టు వీణకు విడాకులు మంజూరు చేసేసింది. ముస్లిం పెళ్లిళ్లలో అబ్బాయే అమ్మాయికి కట్నం ఇచ్చే సంప్రదాయం ఉన్న సంగతి తెలిసిందే. వీణ తీసుకున్న దాంట్లో 25 శాతం భర్తకు తిరిగిచ్చేయాలని కోర్టు ఆదేశించింది. ఖట్టక్.. వీణలకు ఇద్దరు కొడుకులున్నారు.

వీణా మాలిక్ కొన్నాళ్ల కిందట సినిమాల్లోకి పునరాగమనం చేయాలనుకుందట. ఇదే విషయం భర్తకు చెబితే అదేమీ వద్దని.. ఇంటి పట్టునే ఉండి పిల్లల్ని చూసుకోమని చెప్పాడట. దీంతో ఆమెకు ఒళ్లు మండి అతడికి దూరమైంది. విడాకులు తీసుకోవడానికి రెడీ అయిపోయింది. మరి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి షేపవుట్ అయ్యాక వీణకు ఎవరు అవకాశాలిస్తారో.. ఆమె కెరీర్ ఎలా సాగుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/