Begin typing your search above and press return to search.
పాకిస్తానీ 'బాహుబలి' ఇండియా రిలీజ్ కు రెడీ!
By: Tupaki Desk | 23 Dec 2022 5:10 AM GMTఇండియాలో బాహుబలి 2 సినిమా దక్కించుకున్న విజయం ఇప్పటి వరకు.. ఇక ముందు రాబోయే సినిమాలు కూడా దక్కించుకోవడం కష్టం. బాహుబలి 2 రికార్డులు అన్ని బ్రేక్ అవ్వాలి అంటే కనీసం మరో పదేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీ కలెక్షన్స్ ను నమోదు చేసింది.
ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా బాహుబలి రేంజ్ లో 'ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్' సినిమా సూపర్ హిట్ అయ్యింది. పాక్ బాహుబలి అంటూ ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి అవార్డులను దక్కించుకుంటున్న ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్ సినిమాను ఇండియాలో రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారట.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇండియన్ బాక్సాఫీస్ వద్దకు డిసెంబర్ 30న ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్ సినిమా రాబోతుంది. పీవీఆర్ సంస్థ ఇండియన్ థియేట్రికల్ స్క్రీనింగ్ రైట్స్ ను దక్కించుకున్నట్లుగా కూడా తెలుస్తోంది.
పాకిస్తాన్ సినీ చరిత్రలో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన సినిమా గానే కాకుండా అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా గా కూడా ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్ సినిమా నిలిచింది. అందుకే ఈ సినిమా ను ఇండియన్ బాక్సాఫీస్ వద్ద విడుదల చేయాలని కొందరు నిర్మాతలు తీవ్రంగా ప్రయత్నించారట. పీవీఆర్ భారీ రేటు పెట్టి ప్రదర్శణ హక్కులను కొనుగోలు చేశారట.
ఇండియా పాకిస్తాన్ మధ్య సరిహద్దు సమస్యలతో పాటు పలు దాయాదీ సమస్యలు ఉన్నాయి. అయినా కూడా ఇప్పటి వరకు సినిమాల విషయంలో మాత్రం ఎక్కువ ఇబ్బందులు ఎదురు అవ్వడం లేదు. ఇండియన్ సినిమాలు కూడా పాకిస్తాన్ లో విడుదల అయ్యి మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. కనుక ఇప్పుడు పాక్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయాలని సినీ ప్రేక్షకులు ఆశ పడుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.