Begin typing your search above and press return to search.
మీటూ తీర్పు... ఇద్దరు పిల్లల తల్లిని అన్యాయం జరిగిందని గాయని ఆవేదన!!
By: Tupaki Desk | 16 March 2021 2:30 AM GMTపాకిస్తాన్ గాయని మీషా షఫీ తనపై నటుడు అలీ జాఫర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన అనంతరం దీనిపై కోర్టు విచారణ సాగిన సంగతి తెలిసిందే. అయితే వేధింపుల ఆరోపణలు చేసినందుకు మీషా ఇప్పుడు 3 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాల్సి రావడం ప్రముఖంగా చర్చకు వచ్చింది.
2018 మీటూ ఉద్యమంలో అలీ జాఫర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మీషా షఫీ ఆరోపించిన తరువాత చర్చల్లోకొచ్చారు. అప్పట్లోనే #MeToo ఉద్యమం ప్రపంచం మొత్తాన్ని తుఫానులా చుట్టేసింది చాలా మంది మహిళలు.. నటీమణులు కూడా ఆరోపణల అనంతరం పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఉద్యమంలో పలువురు దర్శకనిర్మాతలు.. నటులు గాయకులు చాలా మంది టెక్నీషియన్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆరోపణల ప్రామాణికత గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పాకిస్తాన్ గాయని మీషా షఫీ అలీ పై జాఫర్ లైంగిక దుష్ప్రవర్తన కేసు రివర్స్ తీర్పుతో సంచలనమే అయ్యింది. ఆరోపణలు నిరూపణ కాకపోవడంతో సదరు గాయనీమణికి మూడేళ్ల జైలు శిక్ష విధించడంపై చర్చ సాగుతోంది. ఈ ఉద్యమం గురించి మరోసారి సందేహాలు రేకెత్తాయి.
పాకిస్తాన్ లో ఒక సంగీత కచేరీకి ముందు రికార్డింగ్ స్టూడియోలో అలీ జాఫర్ లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు మీషా ఆరోపించారు. మేరే బ్రదర్ కి దుల్హాన్ నటుడు తనపై ఆమె ఆరోపణలను తోసిపుచ్చడమే గాక.. పరువు నష్టం పేరుతో క్రిమినల్ కేసును ఫైల్ చేశారు. ఇప్పుడు డైలీ మెయిల్ కథనం ప్రకారం..సదరు నటుడి ప్రతిష్టకు హాని కలిగించినందుకు `క్రిమినల్ పరువు నష్టం` ఉద్ధేశపూర్వకంగా కలిగించినందుకు గాయని మీషా మూడేళ్ల జైలు శిక్షను అనుభవించాల్ని ఉంది.
ఇదే కాదు.. ఆన్ లైన్ లో అలీపై ఆరోపణలు చేసిన మరో ఎనిమిది మందిపై కూడా అభియోగాలు మోపారు. ఇంతలో మీషా న్యాయ వ్యవస్థ తీర్పుపైనా కౌంటర్ వేయడం వేడెక్కిస్తోంది. కోర్టులో ఏ మహిళకు న్యాయం జరిగింది...? అని ప్రశ్నించారు. పరిశ్రమకు చెందిన సహోద్యోగి చేతిలో శారీరకంగా పదే పదే లైంగిక వేధింపులకు గురయ్యాను. ఈ సంఘటనలు నా చిన్నతనంలో జరగలేదు. సాధికారిత ఉన్న గాయని అయ్యాక ఇది నాకు జరిగింది. ఇద్దరు పిల్లల తల్లిగా ఈ ఘోరాన్ని ఎదుర్కొన్నాను`` అని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు మీషా.