Begin typing your search above and press return to search.
పక్కా కమర్షియల్ కు పక్కాగా ఇచ్చేశారు!
By: Tupaki Desk | 24 Jun 2022 1:08 PM GMTమారుతి దర్శకత్వంలో రూపొందుతున్న కమర్షియల్ ఎంటర్ టైనర్ `పక్కా కమర్షియల్`. మ్యాచో మాన్ గోపీచంద్ హీరోగా నటించారు. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ఈ మూవీని నిర్మిస్తున్నారు. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రిలీజ్ కి రెడీ అవుతోంది. మరో వారం రోజుల్లో జూలై 1న ప్రేక్షకుల ముందుకు భారీ స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
ఫ్యామిలీ విలువలని జోడించి పక్కా కమర్షయిల్ ఎలిమెంట్స్ పక్కా కమర్షయిల్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని తెరకెక్కించారు. ఫస్ట్ కాపీ పర్ ఫెక్ట్ గా రెడీ అయిపోయిన నేపథ్యంలో చిత్ర బృందం సెన్సార్ కి పంపించేసింది.
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావడంతో సెన్సార్ వారు ఈ మూవీకి యు/ఎ సర్టిఫికెట్ ని ఇచ్చేశారు. ఎంత ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అయినా ఇందులో మారుతి మార్కు హాస్యం వుంటూనే హీరో గోపీచంద్ మార్కు యాక్షన్ ఘట్టాలని తెరకెక్కించారు.
దీంతో సెన్సార్ వారు యాక్షన్, రొమాన్స్ సీన్స్ వుండటంతో నిబంధనల ప్రకారం యు/ఎ ని ఫైనల్ చేసేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమా పక్కా కమర్షియల్ అని తేల్చేయడంతో అందరిలోనూ మంచి ఆసక్తి నెలకొంది. చాలా రోజులుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో గోపీచంద్ కు ఈ మూవీ చాలా కీలకంగా మారింది. మారుతికి కూడా బిగ్ స్టార్ తో హిట్ చాలా అవసరం.. ఈ లెక్కలన్నీ పక్కాగా వేసుకుని చేసిన సినిమానే ఈ `పక్కా కమర్షియల్`.
గత ఏడాది ఈ బ్యానర్ లో వచ్చిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` సక్సెస్ కావడంతో ఈ మూవీ అంతకు మించిన హిట్ కావాలని ప్రత్యేక దృష్టిని పెట్టారు అల్లు అరవింద్, బన్నీ వాసు. అందుకే కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కడా మిస్సవకుండా పక్కాగా ఈ మూవీని తెరపైకి తీసుకొచ్చారు.
కమర్షియల్ లాయర్ అయిన తనయుడికి, రిటైర్డ్ న్యాయమూర్తి అయిన తండ్రికి మథ్య సాగే కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ ఆద్యంతం నవ్వులు పూయిస్తుందట. సరదా సరదాగా సాగే ఈ మూవీలోని ఇతర పాత్రల్లో సత్యరాజ్, అనసూయ, రావు రమేష్, అజయ్ ఘోష్, సప్తగిరి, సాయి కృష్ణ, రమణా రెడ్డి నటించారు.