Begin typing your search above and press return to search.
ఈ సారి పక్కా హిట్టు కొట్టేస్తాడా?
By: Tupaki Desk | 26 Jun 2022 1:30 AM GMTఇండస్ట్రీ జూన్ నెలలో కలకల లాడుతోంది. బ్యాక్ టు బ్యాక్ డజన్ ల కొద్ది సినిమాలు థియేటర్ బాట పట్టేస్తున్నాయి. మే నెలాఖరులో వచ్చిన `మేజర్` బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ మూవీ మూడు భాషల్లోనూ రికార్డు స్థాయి విజయాన్ని అందించింది. ఇక ఈ మూవీ తరువాత జూన్ 3న విడుదలైన `విక్రమ్` రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు నాలుగేళ్ల విరామం అనంతరం కమల్ నుంచి వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో కమల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
మూడు వారాల్లోనే ఈ మూవీ రూ. 300 కోట్ల మైలు రాయిని దాటి కమల్ సినిమాల్లోనే హిస్టరీని క్రియేట్ చేసింది. ఇప్పటికీ ఈ మూవీ అదే క్రేజ్ తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంపరని కొనసాగిస్తూ విజయవంతంగా దూసుకుపోతోంది. ఇక ఈ మూవీ తరువాత భారీ అంచనాల మధ్య విడుదలైన రొమాంటిక్ ఎంటర్ టైనర్ `అంటే సుందరానికి`. నేచురల్ స్టార్ నాని నటించిన ఈ మూవీ జూన్ 10న విడుదలై ఆశించిన ఫలితాన్ని రాబట్టిలేకపోయింది.
టాక్ బాగున్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం నిలబడలేకపోయింది. ఆ తరువాత జూన్ 17న విడుదలైన `విరాటపర్వం` కూడా మంచి టాక్ ని సొంతం చేసుకుంటే కానీ ఆ స్థాయిలో వసూళ్లని మాత్రం రాబట్టలేకి బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేసింది. సత్యదేవ్ నటించిన `గాడ్సే` కూడా ఏ మాత్రం ప్రభావాన్ని చూపించలేకపోయింది. ఇక ఇదే బాటలో ఈ నెల 23, 24న మొత్తం పది చిత్రాల వరకు థియేటర్లోకి వచ్చాయి.
కానీ ఏ ఒక్కటి కూడా నిలబడలేకపోయింది. `విక్రమ్`తో శుభారంభాన్ని అందుకున్న జూన్ నెల ఎండింగ్ కి వచ్చేసరికి దారుణ ఫలితాల్ని అందించింది. ఈ నెల ఎండింగ్ లో వరుసగా క్యూ కట్టిన చిన్న సినిమాల్లో ఏ ఒక్క సినిమా కూడా పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయింది. ఇదిలా వుంటే చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ నటించిన `పక్కా కమర్షియల్` జూలై 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది.
మారుతి డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్ 2 పై బన్నీ వాసు నిర్మించిన ఈ మూవీపైనే గోపీచంద్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు మంచి బజ్ ని క్రియేట్ చేసింది. మేకింగ్, టేకింగ్ పరంగానూ, రీసెంట్ గా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లు సినిమాపై బజ్ ని క్రియేట్ చేశాయి. అంతా పాజిటివ్ గానే కనిపిస్తోంది.
ప్రస్తుత సినిమాలకు ప్రతిబందకంగా మారిన టికెట్ రేట్లని భారీగా తగ్గించి ప్రచారం చేస్తోంది ఈ మూవీ యూనిట్. పాజిటివ్ వైబ్స్ తో వున్న ఈ మూవీతో అయినా ఈ సారి హీరో గోపీచంద్ పక్కా హిట్టు కొట్టేస్తాడా? అని అంతా ఎదురుచూస్తున్నారు.