Begin typing your search above and press return to search.
ఆ టైటిల్ ఎప్పుడు పడుతుందో..!
By: Tupaki Desk | 1 July 2015 3:30 PM GMTసినిమా ప్రపంచలోకి ఎలా అడుగుపెట్టినా కాలక్రమేణా ప్రతి ఒక్కరూ ఆకర్షితులయ్యేది కెప్టెన్ కుర్చీకే. ఆ రంగంలో దానికి మించిన ప్రమోషన్ మరోటి లేదు. నటీనటులు మొదలుకుని కెమెరామన్ వరకూ అందరూ నేడో రేపో మెగాఫోన్ పట్టాలనే అనుకుంటారు. దర్శకుల పక్కనే వుండే రచయితలకైతే ఆ కుర్చీ మరింత ఆకర్షిస్తుంటుంది. ఆ రచయితలు కూడా దర్శకత్వ పాఠాలు నేర్చుకునేది అక్కడినుండే. ప్రస్తుతం టాలీవుడ్ లో రచయితలు దర్శకులుగా మారే ట్రెండ్ నడుస్తోంది. కొరటాల శివ, కెఎస్ రవీంద్ర (బాబీ), అనిల్ రావిపూడి తదితరులు రచయితలుగా రాణించి ఆపై దర్శకులుగానూ విజయం అందుకున్నారు. ఆ జాబితాలోకి చేరాలని ఎన్నాళ్ళ నుండో ఎదురుచూస్తున్న పేరు వక్కంతం వంశీ.
తెలుగు పరిశ్రమలో స్టార్ స్టేటస్ ఉన్న కథా రచయితలలో వక్కంతం వంశీ ఒకరు. చాలా ఏళ్లుగా ఆయన మెగాఫోన్ పట్టాలని తహతహలాడుతున్నారు. ఆ మధ్య జూ. ఎన్టీఆర్ హీరోగా తన మొదటి చిత్రం ఉంటుందని చెప్పారు. ఇప్పటివరకూ అది కార్యరూపం దాల్చలేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ సినిమా చేస్తున్నారు అది పూర్తయిన వెంటనే కొరటాల శివ సెట్ లోకి అడుగుపెడతారట. మరి అలాంటప్పుడు వంశీతో సినిమా ఎలా వీలు పడుతుంది. ఇప్పటివరకూ సురేందర్ రెడ్డికి ప్రధాన బలంగా నిలిచిన వంశీతో సినిమా చేసేందుకు నిర్మాతలు కూడా రెడీ. స్వతహాగా రచయిత కనుక కథలకి కొదువే లేదు. అన్నీ వున్నా డైరెక్టర్ అనే టైటిల్ మాత్రం వెండితెరపై పడడం లేదు. ఆ టైటిల్ ఎప్పుడు పడుతుందో.. వంశీ కోరిక ఎప్పుడు తీరుతుందో..!