Begin typing your search above and press return to search.
'పలాస' దర్శకుడి చేతిలోకి మలయాళ రీమేక్..?
By: Tupaki Desk | 10 Aug 2021 7:31 AM GMTటాలీవుడ్ లో మరో మలయాళ సినిమా రీమేక్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ''నాయాట్టు'' (తెలుగులో 'వేట' అని అర్థం) అనే థ్రిల్లర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. రీమేక్ హక్కులను అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ వారు తీసుకున్నారని సమాచారం.
ఇప్పటికే ఈ మలయాళ రీమేక్ కోసం గీతా వారు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. తక్కువ బడ్జెట్ లో రూపొందే కంటెంట్ బేస్డ్ మూవీ కాబట్టి, వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకురావాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రీమేక్ ప్రాజెక్ట్ ని డైరెక్టర్ కరుణ కుమార్ చేతిలో పెట్టారని టాక్ వినిపిస్తోంది.
'పలాస 1978' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన కరుణ కుమార్.. ఫస్ట్ సినిమాతోనే సెన్సేషనల్ హిట్ అందుకుని సినీ ప్రముఖుల ప్రసంశలు అందుకున్నాడు. ప్రస్తుతం సుధీర్ బాబు హీరోగా 'శ్రీదేవి సోడా సెంటర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.
ఇప్పటికే కరుణ కుమార్ కు అడ్వాన్స్ ఇచ్చిన గీతా ఆర్ట్స్ వారు.. ఇప్పుడు ''నాయట్టు'' రీమేక్ బాధ్యతలను అప్పగించారట. అంతేకాదు మలయాళంలో జోజు జార్జ్ పోషించిన పాత్ర కోసం రావు రమేష్ ని తీసుకున్నారని టాక్. అలానే కుంచాకో బోబన్ రోల్ కోసం వర్సటైల్ యాక్టర్ శ్రీ విష్ణు సంప్రదిస్తున్నారని అంటున్నారు. మూడో కీలక పాత్ర అయిన లేడీ కానిస్టేబుల్ కోసం హీరోయిన్ అంజలి ని అనుకుంటున్నారట. ఇందులో నిజానిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఈ సినిమా ముగ్గురి కెరీర్ లో విభిన్నమైన చిత్రం అవుతుంది. నటనకు ఆస్కారం ఉన్న ఈ పాత్రలు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజకీయ నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వ్యవస్థలను ఎలా ఉపయోగించుకుంటున్నారు అనే కథాంశంతో 'నాయట్టు' సినిమా రూపొందింది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటుగా తమిళ హిందీ భాషల్లో కూడా రీమేక్ చేస్తున్నారని తెలుస్తోంది.