Begin typing your search above and press return to search.
పలాసను జనం బాగానే ఆదరిస్తున్నారు!
By: Tupaki Desk | 10 March 2020 5:18 AM GMTకంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ బాగానే ఉంటుంది. సరైన థియేటర్లు...రిలీజ్ సమయం కుదిరితే సునాయాసంగా వసూళ్లను రాబట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే అవి రెండూ కుదరడం అంత ఈజీ కాదు. కంటెంట్ ఉన్న సినిమాలు పెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థల ద్వారా రిలీజ్ అయితేనే థియేటర్లు దొరుకుతాయి. లేదంటే సినిమాలో ఎంత మ్యాటర్ ఉన్నా... జనాలకు రీచ్ అవ్వడం అసాధ్యం. థియేటర్ల మోనోపలి విధానం కొనసాగినంత కాలం విషయం ఉన్న చిన్న సినిమాలకు ఇలాంటి కొన్ని ఇబ్బందులు తప్పవు.
తాజాగా `లండన్ బాబులు` ఫేం రక్షిత్ హీరోగా నటించిన `పలాస 1978` ఈ శుక్రవారం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కరుణ కుమార్ అనే ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. పలాసలో జరిగిన నాటి కొన్ని వాస్తవ సంఘటల ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకు అన్ని చోట్లా డివైడ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా తేలిపోవడం ఖాయమనే భావించారంతా. కానీ రెండు మూడు రోజుల తర్వాత సీన్ రివర్స్ అయింది. సినిమా స్లో పాయిజన్ లా జనాలకు ఎక్కుతోంది. రిలీజ్ కు ముందు సినిమా ప్రచార చిత్రాలు మంచి హైప్ ని క్రియేట్ చేసాయి కాబట్టి ఆ ఫలితం నెమ్మదిగా కనిపిస్తోంది.
కొత్త కుర్రాళ్లే అయినా ప్రీ రిలీజ్ బిజినెస్ 1.2 కోట్లు జరిగింది. అంటే బ్రేక్ ఈవెన్ సాధించలంటే 1.5 కోట్లు రాబట్టగలగాలి. అయితే తాజాగా ఈ సినిమా సోమవారానికి 1.2 కోట్ల వసూళ్లను రాబట్టింది. మరో 30 లక్షలు రాబట్టగలిగితే బ్రేక్ ఈవెన్ తో సేఫ్ జోన్ లోకి వచ్చినట్లే. అంటే సినిమాను కొన్న వాళ్లు అంతా సేవ్ అవుతారు. అయితే సినిమాకు మిక్స్ డు టాక్ వచ్చినా ఓ చిన్న సినిమా 1.2 కోట్లు తెచ్చిందంటే ప్రశంసించదగ్గ విశయమే. సినిమాలో ఆ మాత్రం స్టప్ లేకుండా అంత మొత్తం ఓ చిన్న సినిమా నాలుగు రోజుల్లో తేగల్గడం విశేషమే కదా. అతిగా ఆశపడకుండా ప్రీ రిలీజ్ బిజినెస్ తక్కువ గా చేయడం వల్ల భారీ లాభాలు లేకపోయినా నష్టాలైతే లేకుండా గట్టేక్కే పరిస్థితి కనిపిస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది.