Begin typing your search above and press return to search.
సుమంత్ తో కంఫర్ట్ అంటున్న సీనియర్ బ్యూటీ
By: Tupaki Desk | 16 July 2016 5:55 AM GMTటాలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్న కొత్త హీరోయిన్ పల్లవి సుభాష్. థియేటర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి.. అటు టీవీల్లోను.. ఇటు సినిమాల్లోను సత్తా చాటుతోంది పల్లవి. పట్టుమని పది సినిమాలే చేసినా సీనియర్ అని ఎందకనాలంటే.. ఈమె ఏజ్ 33 సంవత్సరాలు. అయినా ట్వంటీస్ అన్నట్లుగా కనిపించడం ఈమె స్పెషాలిటీ.
హిందీలో సూపర్ హిట్ అయిన విక్కీ డోనర్ ను తెలుగులో సుమంత్ హీరోగా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మల్లిక్ రామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా.. తనను ఈ మూవీలో రోల్ కోసం సంప్రదించినపుడు చాలా హ్యాపీగా ఫీలయినట్లు చెబుతోంది. 'థియేటర్ ఆర్టిస్ట్ గా చేసిన నాకు రిహార్సల్స్ లో డైలాగ్స్ ప్రాక్టీస్ చేయడం బాగా అలవాటు. కానీ తెలుగు రాకపోవడంతో.. ఇబ్బంది పడ్డాను. ఆ సమయంలో సుమంత్ చేసిన హెల్ప్ సామాన్యమైనది కాదు. హీ ఈజ్ రియల్ జెంటిల్మన్. డైలాగ్స్ కోసం డిక్షన్ లో సాయం చేయడమే కాదు.. నేను సెట్స్ లో కంఫర్ట్ గా ఉండేలా చూసుకున్నారు' అంటోంది పల్లవి సుభాష్.
విక్కీ డోనర్ లో యామీ గౌతమ్ చేసిన రోల్ అంటే తనకు చాలా ఇష్టమన్న పల్లవి.. ఆ రోల్ ను చేయాల్సిందిగా దర్శకుడు మల్లిక్ రామ్ అడిగినపుడు ఎగిరి గంతేసినంత పని చేసిందట. ఇలాంటి గ్రేట్ మూవీతో సుమంత్ తో కలిసి టాలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్నందుకు ఫుల్ హ్యాపీ అంటోంది పల్లవి సుభాష్.