Begin typing your search above and press return to search.
ఆ డైరెక్టర్ మళ్లీ అసిస్టెంట్ ఎందుకయ్యాడు?
By: Tupaki Desk | 13 Nov 2015 5:30 PM GMTఒకసారి డైరెక్టర్ అయ్యాక హిట్టు సినిమా తీసినా.. ఫ్లాప్ సినిమా తీసినా.. మళ్లీ డైరెక్షనే చేస్తాడు. లేదంటే సైలెంటుగా ఉంటాడు. కానీ దర్శకుడిగా అరంగేట్రం చేశాక మళ్లీ అసిస్టెంట్ డైరెక్టర్ గా మరో దర్శకుడి దగ్గర పని చేయడం అరుదుగా జరుగుతుంది. గతంలో కృష్ణవంశీ ‘అనగనగా ఒకరోజు’ సినిమాతో దర్శకుడై.. సరైన ఔట్ పుట్ ఇవ్వకపోవడంతో దర్శకుడిగా తప్పించబడి, తిరిగి అదే సినిమాకు వర్మ దగ్గర అసిస్టెంట్ గా చేయాల్సి రావడం తెలిసిందే. ఐతే ఇందులో కృష్ణవంశీ ప్రమేయం ఏమీ లేదు.
ఐతే ఇక్కడో డైరెక్టర్.. దర్శకుడిగా ఓ సినిమా తీశాక, మళ్లీ తనంతట తానే ఓ దర్శకుడి దగ్గర అసిస్టెంటుగా చేరాడు. ఆ దర్శకుడి దగ్గర పని నేర్చుకుని.. మళ్లీ అదే దర్శకుడి నిర్మాణంలో సినిమా చేశాడు. అతనెవరో కాదు.. పల్నాటి సూర్య ప్రతాప్. ఇతను పని చేసింది సుకుమార్ దగ్గర.
దర్శకుడయ్యాక మళ్లీ అసిస్టెంటుగా పని చేయడమేంటి అని సూర్య ప్రతాప్ ను అడిగితే.. ‘‘సుకుమార్ దగ్గర ‘ఆర్య’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను. తర్వాత ‘కరెంట్’తో డైరెక్టరుగా మారాను. నాకు సెట్ ఫీల్డ్ లో అనుభవం బాగా ఉంది కానీ రైటింగ్ డిపార్ట్మెంట్ లో అనుభవం చాలా తక్కువ. సుకుమార్ గారి రైటింగ్ స్టైల్ ఎవరూ టచ్ చేయలేరు. ఆయన రైటింగ్ స్టైల్ కి వెళ్లాలనే ఉద్దేశంతోనే ఆయన దగ్గర్నుంచి పిలుపు రాగానే వెళ్లి చేరిపోయాను. ఆయనతో పని చేసిన అనుభవం నాకు చాలా చాలా ఉపయోగపడింది. సుకుమార్ గారు రాసుకున్న కథని నాకిచ్చి డైరెక్షన్ చేయమంటే..నా ఈ ఐదేళ్ల జర్నీకి ఒక సార్ధకత వచ్చిందని ఫీలయ్యాను’’ అని చెప్పాడు.