Begin typing your search above and press return to search.
మీటూ శృతి మించింది..నన్ను చంపేస్తారేమో!
By: Tupaki Desk | 10 Nov 2018 5:17 AM GMTప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం మీటూ ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం తెల్సిందే. మీటూ అనేది ఎప్పటి నుండో ఉన్నా కూడా గత సంవత్సరం అక్టోబర్ నుండి ఇది మరీ ఎక్కువ అయ్యింది. హాలీవుడ్ దర్శకుడు హార్వే వెయిన్ స్టెయిన్ పై లెక్కకు మించిన మంది ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన కెరీర్ నాశనం అయ్యింది. అలా ఎంతో మంది హాలీవుడ్ లో ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సినిమా పరిశ్రమలో - వారి కుటుంబంలో కూడా ఉండలేక పోతున్నారని హాలీవుడ్ నటి పమెల్లా ఆండర్సన్ అన్నారు.
తాజాగా మీటూ ఉద్యమం గురించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మీటూ అంటూ లైంగిక ఆరోపణలు చేస్తున్న హీరోయిన్స్ పై పమెల్లా ఆగ్రహం వ్యక్తం చేసింది. మీటూ ఉద్యమం వచ్చిన తర్వాత ఫెమనిజం పెరిగి పోయింది. ఫెమనిజం వల్ల మగవారు అంగవికలాంగులుగా తయారు అయ్యారు. అలా కావడంతో బోర్ కొడుతోంది. మీటూ ఉద్యమం శృతి మించి హద్దు మీరిందని - అందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను అంది. ఈ మాట చెప్పినందుకు నన్ను చంపేస్తారేమో - అయినా కూడా మీటూ ఉద్యమం పట్ల నా తీరు మారదు అంది.
దర్శకుడు హార్వె వెయిస్ స్టెయిన్ పై ఆరోపణలు చేసిన హీరోయిన్స్ ఆయన రూంకు వెళ్లిన సమయంలో తామేం చేస్తున్నామో అర్థం చేసుకోకుండా వెళ్లి పోయారా అంటూ పమెల్లా ప్రశ్నించింది. కొత్త వారి వద్దకు వెళ్లినప్పుడు - అనుమానం ఉన్న వారు పిలిచినప్పుడు ఎవరినైనా వెంట పెట్టుకు వెళ్లాలి. అలా ఒంటరిగా వెళ్లారు అంటే ఖచ్చితంగా వారు ఏదో ఆశించి వెళ్లినట్లే అని - ఆశించి వెళ్లిన వారు ఇప్పుడు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అంటూ పమెలా ఆండర్సన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీటూ ఉద్యమం కారణంగా జరుగుతున్న నష్టం కూడా చాలా ఉందని పమెలాతో పాటు ఎంతో మంది అంటున్నారు.
బాలీవుడ్ లో మీటూ ఉద్యమ ప్రభావం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మీటూ ఉద్యమం వల్ల ఇప్పటికే బాలీవుడ్ లో పలువురు సెలబ్రెటీలు మరియు ప్రముఖులు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎంతో మంది హీరోయిన్స్ - మహిళలు మీటూ అంటూ బాలీవుడ్ సెలబ్రెటీలపై ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే.