Begin typing your search above and press return to search.

అంటే సుందరానికి.. పాన్ ఇండియా బజ్?

By:  Tupaki Desk   |   9 Jun 2022 9:30 AM GMT
అంటే సుందరానికి.. పాన్ ఇండియా బజ్?
X
నాచురల్ స్టార్ నాని ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్త తరహా పాయింట్ ని హైలెట్ చేస్తూ ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాడు. ఇక అతని కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా ఓ వర్గం ప్రేక్షకులు అయితే నా నుంచి పర్ఫెక్ట్ కామెడీ ఎపిసోడ్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే నాని పూర్తిస్థాయిలో కామెడీ సినిమా చేయాలి అనే చాలా రోజులకు అనుకుంటున్నాడు.

చివరగా బలే బలే మగాడివోయ్ సినిమా తో నటించిన నాని మళ్లీ ఆ తర్వాత అలాంటి సినిమాలు చేయలేదు. ఇప్పుడు అంటే సుందరానికి సినిమా అంతకుమించి నవ్వులు తెప్పిస్తుంది అని చాలా ధీమాగా చెబుతున్నాడు.

అయితే ఈ సినిమాకు కేవలం తెలుగులోనే కాకుండా దాదాపు ఫ్యాన్ ఇండియా రేంజ్ లోనే బజ్ క్రియేట్ చేస్తూ ఉండడం విశేషం. అసలు పాన్ ఇండియా అనేది కరెక్ట్ కాదు అని ఓన్లీ సినిమా అనేది పర్ఫెక్ట్ అని చెప్పిన నాని ఇప్పుడు అంటే సుందరానికి సినిమాను పాన్ ఇండియా దిశగా అడుగులు వెయిస్తున్నాడు.

సినిమాలను విడుదలకు ముందు "పాన్ ఇండియా" అని పిలవడాన్ని నేచురల్ స్టార్ వ్యతిరేకించారు. ముందుగా విడుదల చేసిన తరువాత, ఆపై ప్రేక్షకులు వాటిని సరైన పాన్-ఇండియా సినిమాలు అని పిలవగలిగేలా వాటిని బ్లాక్‌బస్టర్‌గా మార్చాలని అన్నారు. అలాగే పుష్పాను ఉదాహరణగా చెప్పాడు. ఇక అంటే సుందరనికి సినిమాను ప్రమోట్ చేస్తున్న విధానం పాన్ ఇండియా అనే ట్యాగ్ తో కనెక్ట్ అయ్యేలా ఉందని కామెంట్స్ వస్తున్నాయి.

ఇక ఈ సినిమా లో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అబ్బాయి అలాగే క్రిస్టియన్ అమ్మాయి ప్రేమించుకున్న తర్వాత వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు ఏ విధంగా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు అనే కథాంశంతో దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించాడు. అయితే సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా ప్రమోట్ చేసే విధంగా నాని అడుగులు వేస్తూ ఉండటం విశేషం.

ఇప్పటికే మలయాళం తమిళ భాషల్లో కూడా ప్రమోట్ చేశారు. ఇక సౌత్లో ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం నార్త్ లో కూడా ఏదో ఒక విధంగా భారీగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ముందుగా ఇక్కడ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుంది అనేది చాలా ముఖ్యం. ఇక ఈ సినిమా మిగతా భాషల్లో కూడా సక్సెస్ అయితే నాని కూడా పాన్ ఇండియా మార్కెట్లోకి ఈజీగా అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. మరి ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.