Begin typing your search above and press return to search.
పాన్ ఇండియా ఫీవర్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు!
By: Tupaki Desk | 21 July 2022 2:30 AM GMTపాన్ ఇండియా ఫీవర్ ఏ రేంజ్ లో కొనసాగుతుందో చెప్పాల్సిన పనిలేదు. ఏ స్టార్ హీరోని కదిపినా పాన్ ఇండియా కంటెంట్ అనే మాట తప్ప మరో మాట రావడం లేదు. పాన్ ఇండియా అనే పదం ఇప్పుడో ప్యాషన్ గా మారిపోయింది. పాన్ ఇండియా ట్రెండ్ సృష్టించింది టాలీవుడ్...శాండిల్ వుడ్ అయినా....చివరికి బాలీవుడ్ సైతం మన ఉడ్ ల్ని కాపీ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
టాలీవుడ్ ట్యాలెంటెడ్ పీపుల్స్ ని తమ బాలీవుడ్ సినిమా ప్రమోషన్లకి వినియోగించుకుంటుంది. మన తరహాలోనే హిందీ వాళ్లు పాన్ ఇండియా పై విపరీతమైన మోజు చూపిస్తున్నారు. తమ సినిమాల్ని తెలుగులో మార్కెట్ క్రియేట్ చేసుకునేలా ఇండియా వైడ్ బిగ్ స్కేల్ లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అదీ టాలీవుడ్ పాన్ ఇండియా సినిమా రేంజ్. త్వరలోనే సౌత్ ఇండస్ర్టీస్ నుంచి మరిన్ని పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి. వాటి సంగతి ఓసారి చూస్తే...
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న'పొన్నియన్ సెల్వన్' రెండు భాగాలు గా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి భాగం ట్రైలర్ తో సినిమాపై అంచనాల్ని పెంచేసింది. 'బాహుబలి' రికార్డుల్నే కొల్లగొడుతుందా? అన్న హైప్ ని తీసుకొచ్చింది. మణిసర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రం మొదటి భాగం సెప్టెంబర్ 30న రిలీజ్ అవుతుంది.
ఇక విజయ్ దేవరకొండ-పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో హిందీ-తెలుగు భాషల్లో తెరకెక్కిన 'లైగర్' భారీ అంచనాలమధ్య పాన్ ఇండియా కేటగిరీలో ఆగస్టు 22న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో విజయ్ రేంజ్ మారిపోతుందని అంచనాలున్నాయి. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలున్నాయి. మరోవైపు అక్కినేని వారసుడు అఖిల్ కూడా స్పై థ్రిల్లర్ 'ఏజెంట్' తో ఇండియా వైడ్ సంచలనాలు సృష్టించడానికి రెడీ అవుతున్నాడు.
స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డితో కలిసి 'ఏజెంట్' తో సందడికి సిద్ద అవుతున్నాడు. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అఖిల్ సిక్స్ ప్యాక్ లుక్ కి అంతా ఫిదా అవుతున్నారు. ఇక దుల్కార్ సల్మాన్ హీరోగా...మృణాల్ ఠాకూర్..రష్మిక మందన్న హీరోయిన్లగా హనురాఘవపూడి తెరకెక్కిస్తోన్న 'సీతరామ' అన్ని పనులు పూర్తిచేసుకుని ఆగస్ట్ 5న రిలీజ్ అవుతుంది.
ఈ సినిమాపై దర్శకుడు చాలా ఆశలే పెట్టుకున్నాడు. అలాగే సుదీప్ హీరోగా తెరకెక్కుతోన్న 'విక్రాంత్ రోణా' పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది. 95 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరోవైపు 'ది లెజెండ్' సినిమాతో హీరోగా పరిచయమవుతోన్న వ్యాపార వేత్త అరుల్ శరవణన్ సినిమా కూడా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.
అలాగే నిఖిల్ హీరోగా నటిస్తోన్న 'కార్తీకేయ-2' అనివార్య కారణాలతో వాయిదా పడింది. త్వరలో ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానుంది. ఇక బాలీవుడ్ నుంచి 'షంషేరా'..'బ్రహ్మాస్ర్త' మొదటి భాగం..'లాల్ సింగ్ చద్దా' చిత్రాలు పాన్ ఇండియా కేటగిరిలో రిలీజ్ అవుతోన్న చిత్రాలే. వీటిపై ఆయా ప్రాంతీయ భాషల్లో భారీ అంచనాలే ఉన్నాయి.