Begin typing your search above and press return to search.
విరూపాక్ష.. బాక్సాఫీస్ భయమేళ!
By: Tupaki Desk | 29 April 2023 3:27 PM GMTసాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం విరూపాక్ష. ఈ మూవీథియేటర్స్ లో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. తేజ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ దిశగా ఈ మూవీ కొనసాగుతోంది. కంప్లీట్ హర్రర్ థ్రిల్లర్ జోనర్ లోనే ఈ సినిమాని దర్శకుడు కార్తీక్ దండు ఆవిష్కరించారు.
ఇక ఈ మూవీకి తేజ్ కూడా ప్రాణం పెట్టి పనిచేశారు. అదిరిపోయే ట్విస్ట్ లు, సీట్ ఎడ్జ్ కూర్చోబెట్టే సీక్వెన్స్ లతో దర్శకుడు అద్భుతంగా కథని నడిపించారు. ఇక ఈ మూవీకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సుకుమార్ అందించారు. తేజ్ కెరియర్ లో మొట్టమొదటి 50 కోట్ల మూవీ ఇదే కావడం విశేషం. మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని రీచ్ అయ్యింది.
మొదటి వారంలోనే ఏకంగా 50 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిపోయింది. అయితే విరూపాక్ష సినిమాకి ఏప్రిల్ 21న రిలీజ్ అయినా శాకుంతలం సినిమా అడ్డు పడుతుందని భావించారు. అయితే ఆ మూవీ డిజాస్టర్ అయ్యింది. దీంతో తేజ్ స్పీడ్ కొనసాగుతూ వస్తోంది. ఇక ఏప్రిల్ 28న రిలీజ్ అయిన అఖిల్ ఏజెంట్ మూవీ విరూపాక్ష కలెక్షన్స్ కి బ్రేక్స్ వేస్తుందని అంచనా వేశారు.
అయితే ఏజెంట్ తో పాటు పొన్నియన్ సెల్వన్ 2 రిలీజ్ అయిన కూడా విరూపాక్ష ఏకంగా 1.50 కోట్ల షేర్ వచ్చింది. రెండు వారల తర్వాత ఈ స్థాయిలో షేర్ అంటే మంచి కలెక్షన్స్ అని చెప్పాలి. ఇక ఏజెంట్ మూవీకి కూడా నెగిటివ్ టాక్ రావడంతో మరల వీకెండ్ రెండు రోజులు కలెక్షన్స్ కొంత వరకు పెరిగే అవకాశం ఆడొచ్చు అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఏది ఏమైనా మూడు పాన్ ఇండియా సినిమాలు వచ్చిన కూడా విరూపాక్ష కలెక్షన్స్ పై ప్రభావం చూపించలేకపోయాయి అంటే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అర్ధం చేసుకోవచ్చు. మరి లాంగ్ రన్ లో ఏమైనా వంద కోట్ల క్లబ్ లో విరూపాక్ష చేరే అవకాశం ఉంటుందా అనేది వేచి చూడాలి.