Begin typing your search above and press return to search.
మేకర్స్ కి పాన్ ఇండియా స్టార్ కండీషన్స్
By: Tupaki Desk | 17 Feb 2023 12:02 PM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా మూవీస్ లో నటిస్తున్నాడు. ఇవన్నీ కొట్ల రూపాయల బడ్జెట్ లతో అత్యంత భారీ స్థాయిలో ప్రభాస్ ఇమేజ్ కి తగ్గ రేంజ్ లో రూపొందుతున్నాయి. ఇందులో ఒక్కో సినిమా కోసం వంద కోట్లకు మించి ఖర్చు చేస్తున్నారు. ఆది పురుష్ మూవీ కోసం ముందు 500 కోట్లు అనుకున్నారు. కానీ ఆ తరువాత వీఎఫ్ ఎక్స్ విషయంలో జరిగిన తప్పుల కారణంగా ఈ సినిమా బడ్జెట్ మరో 100 కోట్లు పెరిగింది.
రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ పై విమర్శలు వెల్లువెత్తడంతో చిత్ర బృందం ప్రస్తుతం వీఎఫ్ ఎక్స్ కి సంబంధించిన కరెక్షన్స్ తో పాటు గ్రాఫిక్స్ మరింత మెరుగ్గా వుండటానికి మకరో వంద కోట్లు ఖర్చు చేస్తూ 'ఆది పురుష్' సర్వాంగ సుందరంగా వుండేలా ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వర్క్ జరుగుతోంది. ఈ మూవీని జూన్ 16న అత్యంత భారీ స్థాయిలో ఐదు భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్‌ఖ చేస్తున్నారు. రామాయణ గాధ ఆధారంగా ఈ మూవీని దర్శకుడు ఓం రౌత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
యావత్ దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఏడాది జూన్ 16న ఈ మూవీని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా వుంటే ఈ మూవీ తో పాటు మరో మూడు సినిమాల్లో ప్రభాస్ నటిస్తున్నాడు. 'కేజీఎఫ్' ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', నాగ్ అశ్విన్ తో 'ప్రాజెక్ట్ కె', మారుతి డైరెక్షన్ లో 'రాజా డీలక్స్' (టైటిల్ ఇంకా ఫైనల్ కాలేదు) చిత్రాలు చేస్తున్నాడు. అవే కాకుండా బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్ధ్ ఆనంద్ తో మైత్రీ వారు నిర్మించబోయే సినిమా కూడా చేయబోతున్నాడు.
ఇదిలా వుంటే 'ఆదిపురుష్' తరువాత చేస్తున్న సినిమాల మేకర్స్ కి ప్రభాస్ ఓ కండీషన్ పెట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆది పురుష్ జూన్ 16న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు తను చేస్తున్న సినిమాల అప్ డేట్ లు, ప్రత్యేక ప్రకటనలు చేయకూడదని మేకర్స్ తో చెబుతున్నాడట. 'ఆదిపురుష్' తరువాతే మిగతా సినిమాల అప్ డేట్ లు విడుదల చేయాలని ఖచ్చితంగా చెప్పేశాడట.
గతంలో తన సినిమాల విషయంలో ఇలా నిర్మాతలకు కండీషన్స్ పెట్టన ప్రభాస్ కొత్తగా 'ఆది పురుష్' విషయంలో కండీషన్స్ పెడుతుండటం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చాలా వరకు ఫిల్మ్ మేకర్స్ ప్రభాస్ కండీషన్స్ పై చర్చించుకుంటున్నారట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.