Begin typing your search above and press return to search.
సెట్లో సందడికి రెడీ అవుతున్న పాన్ ఇండియా స్టార్
By: Tupaki Desk | 27 Jan 2022 1:30 PM GMTదేశ వ్యాప్తంగా పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. కారోనా, ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో చాలా వరకు భారీ చిత్రాల రిలీజ్ లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్ సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఈ చిత్రాలని అర్థాంతరంగా వాయిదా వేశారు. అయితే కారోనా, ఒమిక్రాన్ వైరస్ ల ప్రభావం రిలీజ్ కోసం రెడీగా వున్న చిత్రాలపైనే కాకుండా సెట్స్ పై వున్న భారీ చిత్రాలపై కూడా పడింది. దీంతో చాలా వరకు స్టార్స్ తమ చిత్రాల షూటింగ్ లని నిలిపి వేశారు. కాలీ సమయం చిక్కడంతో కొంత మంది ఇతర దేశాలల్లో విహరిస్తుంటే మరి కొంత మంది స్టార్ లు తమ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా తన `సరార్` మూవీని షూటింగ్ కి బ్రేకిచ్చేసి యూరప్ ట్రిప్ కు వెళ్లారు. ఇటీవలే తన ట్రిప్ ని ముగించుకుని ఇండయా తిరిగి వచ్చేశారు. గత రాత్రి హైదరాబాద్ లో ల్యాండ్ అయిపోయారు. యూరప్ ట్రిప్ పూర్తి కావడంతో హైదరాబాద్ తిరిగి వచ్చేసిన ప్రభాస్ నిర్మాణ దశలో వున్న తన ప్రాజెక్ట్ ల షూటింగ్ లని మళ్లీ తిరిగి ప్రారంభించబోతున్నారట. ఇప్పటికే ప్రభాస్ రెండు పాన్ ఇండియా చిత్రాల షూటింగ్ లని రికార్డు స్థాయి వేగంతో పూర్తి చేశారు.
`రాధేశ్యామ్` కోసం కొంత ఎక్కువ సమయమే పట్టినా `ఆది పురుష్` చిత్ర షూటింగ్ ని మాత్రం ఆశ్చర్యపోయే విధంగా రికార్డు స్థాయిలో తక్కువ సమయంలోనే పూర్తి చేసేశారు. వీఎఫ్ ఎక్స్ కు భారీ స్కోప్ వున్న మూవీ కావడంతో ఈ మూవీ షూటింగ్ ని ముందుగానే పూర్తి చేసి మిగతా చిత్రాల షూటింగ్ కోసం రెడీ అయిపోయారు.
రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాల తరువాత సలార్, `ప్రాజెక్ట్ కె` చిత్రాల్లో నటిస్తున్నారు ప్రభాస్. ఈ రెండు చిత్రాల్లో `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న `సలార్` ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. దీంతో ఈ మూవీని త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ భావిస్తున్నారట. ఆ కారణంగానే యూరప్ ట్రిప్ ముగించుకుని హైదరాబాద్ తిరిగి చేరుకున్నప్రభాస్ ముందుగా `సలార్` షూటింగ్ ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారట. త్వరలోనే `సలార్` సెట్స్ లో ప్రబాస్ సందడి చేయడానికి రెడీ అవుతున్నారని చెబుతున్నారు.
ఈ మూవీతో పాటే `ప్రాజెక్ట్ కె` ని కూడా ఆపకుండా పూర్తి చేయాలని ప్రబాస్ భావిస్తున్నారట. సైన్స్ పిక్షన్ థ్రిల్లర్ గా `ప్రాజెక్ట్ -కె` రూపొందుతోంది. హిమాలయాల్లో వున్న ఓ గుహ నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథగా ఈ మూవీ సరికొత్త అనుభూతిని ఇవ్వబోతోందని చెబుతున్నారు. `ఆదిత్య 369` తరహాలో ఆ గుహ నుంచి మరో కాలానికి ప్రయాణించి ప్రభాస్ అండ్ కో ఏం చేశారన్నదే ఈ చిత్ర కథగా వార్తుల వినిపిస్తున్నాయి. దీనికి బలాన్ని చేకూరుస్తూ సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు ఈ మూవీకి మెంటర్ గా వ్యవహరిస్తుండటం గమనార్హం.