Begin typing your search above and press return to search.

నా జీవితంలో వీళ్లే పంచ పాండవులు : నితిన్‌

By:  Tupaki Desk   |   18 Feb 2020 5:30 AM GMT
నా జీవితంలో వీళ్లే పంచ పాండవులు : నితిన్‌
X
నితిన్‌ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌ గా ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ‘భీష్మ’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను నిన్న యూసుఫ్‌ గూడ పోలీస్‌ లైన్స్‌ లో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ప్రత్యేక అతిథిగా హాజరు అయ్యాడు. చిత్ర యూనిట్‌ సభ్యులు ఇంకా దిల్‌ రాజు.. నిర్మాత చినబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా దర్శకుడు వెంకీ మాట్లాడుతూ.. తాను అఆ సినిమా సమయంలో త్రివిక్రమ్‌ గారికి అసిస్టెంట్‌ గా చేశాను. అంతటి గొప్ప వ్యక్తికి నన్ను పరిచయం చేసినందుకు చినబాబు గారికి కృతజ్ఞతలు. త్రివిక్రమ్‌ గారికి నేను అభిమానిని కాదు ఆయన భక్తుడిని అన్నాడు. నితిన్‌ ఫ్యాన్స్‌ కు సారీ.. మంచి సినిమా కోసం స్క్రిప్ట్‌ విషయంలో టైం ఎక్కువ తీసుకున్నాము. మిమ్ములను అస్సలు నిరుత్సాహ పర్చకుండా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు అన్నాడు.

నితిన్‌ మాట్లాడుతూ.. వెంకీ నాకు చాలా పెద్ద ఫ్యాన్‌ అని చెప్పాడు. దిల్‌ సినిమా అప్పటి నుండి కూడా నన్ను అభిమానిస్తున్నాను అని చెప్పడం ఆనందంగా అనిపించింది. రష్మికతో నటించడం సంతృప్తిని ఇచ్చింది. ఇక నా జీవితంలో అయిదుగురు మోస్ట్‌ పేవరేట్‌ అంటే అమ్మ.. నాన్న.. సిస్టర్‌.. పవన్‌ కళ్యాణ్‌.. త్రివిక్రమ్‌. ఈ అయిదుగురు నా జీవితంలో పంచ పాండవులు వంటి వారు. ఇక మీదట ఈ జాబితాలో నా భార్య కూడా చేరుతుందన్నాడు.

త్రివిక్రమ్‌ గారు నాకు మార్గ నిర్ధేశకుడు అన్నాడు. నా కెరీర్‌ కు ఆయన మార్గదర్శి అన్నాడు. ఈ చిత్రంకు కాస్త ఆలస్యం అయినా ఖచ్చితంగా ఇది మిమ్ములను ఆనందింపజేస్తుందని నితిన్‌ హామీ ఇచ్చాడు.