Begin typing your search above and press return to search.
'పంచతంత్రం' ట్రైలర్: పంచేద్రియాల ఇతివృత్తంగా ఐదు కథల సమాహారం..!
By: Tupaki Desk | 26 Nov 2022 11:50 AM GMTప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం - కలర్స్ స్వాతి రెడ్డి - సముద్రఖని - రాహుల్ విజయ్ - శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ''పంచతంత్రం''. కొత్త దర్శకుడు హర్ష పులిపాక తెరకెక్కిస్తున్నాడు. నిర్మాణాంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేస్తున్నారు.
'పంచతంత్రం' నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను ఆవిష్కరించారు. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపింది.
పంచతంత్రం అనేది ఐదు కథల సమాహారంగా తెలుస్తోంది. బ్రహ్మానందం ఈ కథలను చెప్పడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. దీని కోసం ఆయన దృష్టి - వాసన - ధ్వని - రుచి - స్పర్శ వంటి పంచేద్రియాల థీమ్ ని ఎంచుకున్నారు. ఇది శాంతి - భయం - సంకల్పం - ప్రేమ - జీవితంతో వ్యవహరించే ఒక బ్యూటిఫుల్ మోడరన్ స్టోరీ అని తెలుస్తోంది.
ఇందులో కలర్స్ స్వాతి ఫిజికల్ హ్యాండీక్యాప్ గా ఛాలెంజింగ్ రోల్ లో కనిపించింది. ఆమె ఒక రేడియో జాకీగా పరిచయం చేయబడింది. సముద్రఖని - దివ్యవాణి మిడిల్ ఏజ్ భార్యా భర్తలుగా.. ప్రేమ వివాహం చేసుకున్న జంటగా వికాస్ ముప్పాల - దివ్య శ్రీపాద.. ప్రేమికులుగా రాహుల్ విజయ్ - శివాత్మిక రాజశేఖర్ కనిపించారు. ఆదర్శ్ బాలకృష్ణ - ఉత్తేజ్ - నరేష్ అగస్త్య - శ్రీవిద్య ఇతర పాత్రలు పోషించారు.
ప్రతి ఒక్కరి జీవితాలు భిన్నంగా ఉన్నాయి.. ప్రతి కథకు కూడా ప్రాధాన్యత ఉన్నట్లు కనిపిస్తోంది. 'కష్టం వచ్చింది కదా అని దించేసుకోడానికి ఇది భారం కాదు.. బాధ్యత' 'నీ లైఫ్ ఎంత ఇంపార్టెంట్ అనుకుంటావో.. నీతో షేర్ చేసుకునే వారి లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు అడ్జస్ట్మెంట్ కు ఉన్న వేల్యూ తెలుస్తుంది' వంటి డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి.
ట్రైలర్ చూస్తుంటే.. 'పంచతంత్రం' అనేది క్లాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే సినిమా అనిపిస్తోంది. సంగీతం మరియు విజువల్స్ కూడా అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి. ఓవరాల్ గా, అన్ని రకాల ఎమోషన్స్ తో కూడిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ప్రశాంత్ ఆర్ విహారి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. 'కలర్ ఫోటో' ఫేమ్ సందీప్ రాజ్ డైలాగ్స్ రాశారు. రాజ్ కె నల్లి సినిమాటోగ్రఫీ అందించగా.. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.
టికెట్ ఫ్యాక్టరీ మరియు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై అఖిలేష్ వర్ధన్ - సృజన్ ఎరబోలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ''పంచతంత్రం'' చిత్రాన్ని డిసెంబర్ 9న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.