Begin typing your search above and press return to search.
#BB3 మహమ్మారీ బాలయ్యనూ భయపెట్టిందా?
By: Tupaki Desk | 18 Nov 2020 4:30 PM GMTకరోనా ముందు .. కరోనా తర్వాత!! అన్న చందంగా మారింది సన్నివేశం. ముఖ్యంగా టాలీవుడ్ భవితవ్యం ఆగమ్యగోచరంగా మారింది. ఇటు షూటింగులు చేస్తున్నా రిలీజ్ లకు ఆస్కారం కనిపించడం లేదు. థియేటర్లు ఎప్పటికి తెరుచుకుంటాయో తేలని సన్నివేశం కనిపిస్తోంది. ఆ క్రమంలోనే ఏడాది పాటు ఏ సినిమా చేసినా దానికి సంబంధించిన బడ్జెట్ రికవరీ అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
దీంతో బడా హీరోలంతా తమ సినిమాల బడ్జెట్లను కుదించుకుంటున్నారు. దర్శకనిర్మాతలతో చర్చించి ఎంత బడ్జెట్ పెడితే రికవరీ సాధ్యమో.. డిజిటల్ కి సేల్ చేయాల్సి వస్తే ఆ ఆపరేషన్ కి ఎంత బడ్జెట్ అనుకూలమో బాగా రీథింక్ చేస్తున్నారట. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సహా మహేష్.. బన్ని.. తారక్ తదితరులు తమ సినిమాల బడ్జెట్ల పై పునరాలోచిస్తున్నారన్న సమాచారం ఉంది. పలు పాన్ ఇండియా సినిమాల బడ్జెట్లు కూడా కుదించేస్తుండడంపై ఇటీవల చర్చ సాగింది.
ఇప్పుడు మహమ్మారీ ప్రభావం బాలయ్య బీబీ3 (ఎన్బీకే 106) పైనా పడిందన్న చర్చ మొదలైంది. బోయపాటి దర్శకత్వంలో రవీందర్ రెడ్డి నిర్మించే సినిమా బడ్జెట్ ని కుదించారని .. చివరికి వారణాసి షెడ్యూల్ ని కూడా ఎత్తేసి.. హైదరాబాద్ లోనే షూటింగ్ చేయనున్నారని కథనాలు వెలువడుతున్నాయి. దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించాలని తొలుత భావించారు. కానీ కోవిడ్ తర్వాత మైండ్ సెట్ మారింది. దర్శకనిర్మాతలు ఇరువురూ బాలయ్యతో చర్చించి బడ్జెట్ అదుపు తప్పకుండా జాగ్రత్తలు తీసుకున్నారట. కొంతవరకూ కోత పెట్టేస్తే ఆ మేరకు రికవరీ సాధ్యమేనని ఈ నిర్ణయం తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దేనికీ మేకర్స్ నుంచి అధికారిక సమాచారం అయితే లేదు.