Begin typing your search above and press return to search.
ఎన్నాళ్లకెన్నాళ్లకు 50 డేస్ పోస్టర్
By: Tupaki Desk | 14 May 2022 11:30 AM GMTదేశం మొత్తం ఆసక్తిగా చూసిన చిత్రం `ట్రిపుల్ ఆర్` (రౌద్రం రణం రుధిరం) రెండున్నరేళ్ల ఎదురుచూపుల తరువాత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లెజెండకరీ ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు, కొమురం భీం పాత్రల్లో నటించారు. 1920 లో జరిగిన ఫ్రీడమ్ ఫైట్ కి ఈ ఇద్దరు పోరాట యోధుల ఫిక్షనల్ స్టోరీని జోడించి ఆద్యంతం ఆసక్తికరంగా ట్రిపుల్ ఆర్ ని దర్శకుడు రాజమౌళి తెరకెక్కించారు.
తెలుగులో తొలిసారి ఇద్దరు క్రేజీ స్టార్లు చాలా ఏళ్ల విరామం తరువాత కలిసి నటించడంతో ఈ మూవీని ప్రేక్షకులు చాలా ప్రత్యేకంగా చూశారు. సినిమాకు బ్రహ్మరథం పట్టారు. సరికొత్త నేపథ్యంలో ఇద్దరు స్టార్ లు నటించిన పీరియాడిక్ ఫిక్షనల్ స్టోరీ కావడంతో ఈ సినిమా విషయంలో యావత్ దేశ వ్యాప్తంగా వున్న ప్రేక్షకులు సినిమాకు కాసుల వర్షం కురిపించారు. చరణ్, ఎన్టీఆర్ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి అలనాటి పోరాట యోధులని గుర్తు చేసిన తీరుకు ప్రేక్షకులు ప్రశంసలు కురించారు.
ఊహించని విధంగా 1100 కోట్ల క్లబ్ లో చేర్చారు. ఇదిలా వుంటే ఈ మూవీని మే 20న ప్రముఖ ఓటీటీ దిగ్గజం జీ5 స్ట్రీమింగ్ చేయబోతోంది. దక్షిణాది భాషలకు సంబంధించిన వెర్షన్ లని జీ5 స్ట్రీమింగ్ చేస్తుండగా హిందీ వెర్షన్ మాత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఇదిలా వుంటే ట్రిపుల్ ఆర్ ఈ శుక్రవారానికి 50 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. వరల్డ్ వైడ్ గా ఐదు భాషల్లో భారీ స్థాయిలో విడుదలైన ఈ మూవీ విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకోవడంతో చిత్ర బృందం శుక్రవారం 50 డేస్ పోస్టర్ ని సోషల్ మీడియా వేదిగా అభిమానులతో పంచుకున్నారు.
విడుదలైన అన్ని థియేటర్లలో ఈ మూవీ ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శింపబడుతూ 50 రోజులు పూర్తి చేసుకుందని, ఈ ఫీట్ ని ప్రపంచ వ్యాప్తంగా వున్న 500 థియేటర్లలో సాధించిందని, మీ ప్రేమకు, అభిమానానికి ముగ్థులమంటూ చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ పోస్టర్ చూసిన వాళ్లంతా చాలా ఏళ్ల తరువాత 50 రోజుల పోస్టర్ ని చూశామని అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఏ సినిమా 50 రోజుల పోస్టర్ ని ప్రదర్శించలేదు. అన్ని రోజులు ఆడలేదు కూడా.
ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఆర్ 50 డేస్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేయడం విశేషంగా చెబుతున్నారు. ట్రిపుల్ ఆర్ డెఫ్ షీట్ తో రన్నవుతున్నా ఈ ఫీట్ ని సాధించి ఆనాటి రోజుల్ని గుర్తుచేసింది. అయితే జెన్యూన్ గా అలనాటి తరహాలో సినిమాలు ఫేక్ కలెక్షన్ లు, సూపర్ హైప్ ని క్రియేట్ చేసే పోస్టర్ల ని పక్కన పెడితే మంచిది. దీని వల్ల డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లు పెద్దగా ఒరిగేది ఏమీ వుండదు. ఈ రికార్డుల పబ్లిసిటీలు మాని మన స్టార్స్ తమ మైండ్ సెట్ ని మార్చుకుంటే మళ్లీ తెలుగు సినిమాకు మంచి రోజులొస్తాయి అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.