Begin typing your search above and press return to search.
పానిపట్ సాంగ్ మర్ద్ మరాఠా
By: Tupaki Desk | 13 Nov 2019 10:18 AM GMTచరిత్ర పుటల్లో దాగి ఉన్న రాచరికాన్ని.. భారీ వారియర్ కథల్ని బయట కు వెలికి తీస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. బాహుబలి అ సాధారణ విజయం అనంతరం పెను విప్లవం ఇదని చెప్పాలి. ఇంతకుముందు `సైరా-నరసింహారెడ్డి` వచ్చింది. రాయలసీమ యోధుడైన తెలుగు వీరుడి జీవిత కథను అద్భుతం గా చూపారు. ఇప్పుడు పానిపట్ అంటూ మరాఠా సంస్కృతి ని నాటి రాజాధిరాజుల్ని పరిచయం చేస్తూ `పానిపట్` అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు బాలీవుడ్ లో. పాన్ ఇండియా కేటగిరీలో హిస్టారికల్ చిత్రాల బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవారికర్ చేస్తున్న ప్రయత్నమిది. సంజయ్ దత్-అర్జున్ కపూర్-కృతి సనోన్ వంటి స్టార్లు నటిస్తున్నారు. ఇటీవలే సంజయ్ దత్ - అర్జున్ కపూర్- కృతి వంటి స్టార్ల లుక్ ని రివీల్ చేశారు. వాటికి చక్కని స్పందన వచ్చింది. పానిపట్ ట్రైలర్ రిలీజై ఎంతో ఎమోషన్ భారీతనం తో అలరించింది.
తాజాగా ఈ చిత్రం నుంచి `మర్ధ్ మరాఠా` అంటూ సాగే ఓ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ పాట లో అర్జున్ కపూర్- కృతి సనోన్ జోడీ.. మోనీష్ బాల్- పద్మిని కొల్హాపురి సహా తదితర స్టార్లు కనిపించారు. పవర్ ఆఫ్ మరాఠాస్..! అనే అర్థం లో సాగిన ఈ పాట మరాఠా యోధుల వీరత్వం పై పొగడ్త అని అర్థమవుతోంది. మరాఠా సామ్రాజ్యంలో జరుగుతున్న సెలబ్రేషన్స్ కి సంబంధించిన పాట ఇది. దాదాపు 1300 మంది డాన్సర్స్ తో విజువల్ ఫీస్ట్ గా రూపొందించామని దర్శకుడు చెబుతున్నారు.
ఈ పాట లో సదా శివరావ్ బాహు (అర్జున్ కపూర్).. అతడి రెండో భార్య అయినా పార్వతి భాయ్ (కృతి) జంట మధ్య సైలెంట్ రొమాన్స్ ఎంతో ఆకర్షణీయం గా తీర్చి దిద్దారు. అలాగే మరాఠా యోధుడి గా అర్జున్ కపూర్ సెంట్ పర్సంట్ యాప్ట్ అని అతడి గెటప్ చెబుతోంది. సామంత రాజులు.. మిత్ర దేశాల రాజులు.. సైన్యాధ్యక్షులు ఒకరేమిటి రాజాధిరాజాని ప్రశంసిస్తూ ఆడి పాడుతున్న దృశ్యాలు కన్నుల పండువగా తెరకెక్కించారు. అహ్మద్ షా అబ్ధాలీ అనే ఆఫ్ఘనిస్తాన్ రాజు గా సంజయ్ దత్ ఈ చిత్రం లో నటిస్తున్నారు. తాజా పాటలో కెమెరా- సంగీతం- విజువలైజేషన్ భారీతనం .. ప్రతిదీ హైలైట్. ఈ సినిమా వార్ బ్యాక్ డ్రాప్ కాబట్టి ఎమోషన్ కి ఆస్కారం ఎక్కువ. మరి ఉత్తరాది బెల్టు తో పాటు దక్షిణాదినా రిలీజై విజయం అందుకుంటుందా? అన్నది చూడాలి. ఈనెల 22న సినిమా రిలీజ్ కానుంది.