Begin typing your search above and press return to search.

తక్కువకే పంతం బిజినెస్ క్లోజ్

By:  Tupaki Desk   |   4 July 2018 5:44 PM IST
తక్కువకే పంతం బిజినెస్ క్లోజ్
X
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో పాటు హిట్టు కోసం రేపు అదృష్టం పరీక్షించుకుంటున్న హీరోల్లో గోపీచంద్ కూడా ఉన్నాడు. దర్శకుడిగా పరిచయమవుతున్న రచయిత చక్రవర్తి దర్శకత్వంలో చేసిన పంతం సినిమా గురువారం గ్రాండ్ గ్రా రిలీజ్ చేయనున్నారు. గోపీచంద్ కెరీర్ లో ఇది 25వ సినిమా. ఇక సినిమా ట్రైలర్ ఈ సారి కొంచెం హైప్ క్రియేట్ చేసిందని చెప్పాలి. తప్పకుండా సినిమాలో మ్యాటర్ ఉంటుందనే టాక్ వస్తోంది.

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. మొత్తంగా సినిమా 14 కోట్లకు అమ్మడు పోయింది. గోపీచంద్ కెరీర్ లో ఇది మినిమమ్ రేట్ అని చెప్పాలి. చాలా తక్కువ రేటుకే నిర్మాతలు బిజినెస్ క్లోజ్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. మినిమమ్ టాక్ వచ్చినా కూడా యాక్షన్ హీరో లాభాలని రాబట్టగలడు. కొన్ని ఏరియాల్లో అయితే సినిమా ఊహించని విధంగా తక్కువ ధరలకు అమ్ముడు పోయింది. గత చిత్రాలు దెబ్బ కొట్టడంతో గోపి మార్కెట్ కి కాస్త ఎఫెక్ట్ పడిందని చెప్పవచ్చు. తమిళ్ నాడు కర్ణాటక - నార్త్ ఇండియాల్లో కోటికి పైగా అవుట్ రేట్ కు ఈ సినిమా అమ్ముడుపోయింది.

నైజం 3.30 Cr
సీడెడ్ 2.25 Cr NRA
ఉత్తరాంధ్ర 1.40 Cr NRA
ఈస్ట్ 0.80 Cr NRA
గుంటూరు 0.90 Cr NRA
కృష్ణ 0.70 Cr NRA
వెస్ట్ 0.70 Cr NRA
నెల్లూరు 0.45 Cr NRA
ఏపి / తెలంగాణ 10.50 Cr

కర్ణాటక + తమిళనాడు + నార్త్ ఇండియా 1.10 అవుట్ రైట్
ఓవర్సీస్ 0.50 Cr
ప్రపంచవ్యాప్తంగా 12.10 Cr
ప్రపంచవ్యాప్తంగా ఖర్చులతో కలిపి 14 Cr