Begin typing your search above and press return to search.
టీజర్ టాక్: గోపిచంద్ 'పంతం' అదిరింది
By: Tupaki Desk | 5 Jun 2018 5:43 AM GMTచాన్నాళ్ల తరువాత ఒక మాంచి కమర్షియల్ సినిమాతో వస్తున్నాడా అంటే అవుననే చెప్పాలి. యాక్షన్ హీరో గోపిచంద్ ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలన్నింటిలోనూ ఏదో మిస్సింగ్ అనే ఫీలింగ్ వచ్చేది. కాని ఇప్పుడు మాత్రం కమర్షియల్ ఫార్మాట్ లో ఏది కావాలో అది చెబుతూ.. అదరగొట్టేస్తున్నాడు అనిపిస్తోంది. పదండి ఆ 'పంతం' ఏంటో మనం కూడా చూద్దాం.
అతను ఏం జాబ్ చేస్తాడో తెలియదు కాని.. ''లోపలున్నది బయటకు తీస్తాం.. బయటున్నది లోపలేస్తాం'' అంటూ తన గురించి తానే చెప్పుకుంటాడు హీరో. అయితే ఆ క్రమంలో హ్యాకింగ్.. పోలీస్ తరహాలో చేజింగ్.. అదే విధంగా న్యాయం కోసం సొసైటీ కోసం పోరాడుతున్నాడు అని తెలుస్తోంది. ఆద్యంతం చాలా ఆసక్తికరంగా సాగిన పంతం టీజర్లో.. 'కరెంట్ ఫ్రీ అది ఫ్రీ ఇది ఫ్రీ అంటూ ఓటేసిన జనాలు.. కరప్షన్ లేని సమాజాన్నిఎలా ఊహించుకుంటారు?' అంటూ హీరో అడిగే సీన్ ఏదైతే ఉందో.. ఆ డైలాగ్ అదిరిపోయింది. మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి కామెడీ కూడా బాగానే ఉండోబోతందని అనుకోవాలి.
ఇకపోతే కొత్త దర్శకుడు చక్రవర్తి సినిమాను బాగానే తీర్చిదిద్దాడు. చూస్తుంటే ఒక సోషియో పొలిటికల్ డ్రామాగా ఉన్న ఈ సినిమాకు గోపిసుందర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. అలాగే ప్రసాద్ మురెళ్ల కెమెరె వర్క్ కూడా అదిరిపోయింది. మొత్తానికి ఈసారి గోపిచంద్ పంతం పట్టి మరీ హిట్టు కొట్టేస్తాడేమో అనిపిస్తోంది. లెటజ్ సీ.