Begin typing your search above and press return to search.
బ్రహ్మోత్సవం తొలి రోజు 624 భోజనాలు
By: Tupaki Desk | 18 May 2016 7:25 AM GMTబ్రహ్మోత్సవం ఎంత భారీ చిత్రమో.. భోజనాల లెక్కతో చెబుతున్నాడు నిర్మాత పొట్లూరి వరప్రసాద్. రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ‘బ్రహ్మోత్సవం’ తొలి రోజు షూటింగ్ సందర్భంగా యూనిట్లో 624 మందికి భోజనాలు పెట్టించారట. దీన్ని బట్టే తమ సినిమా ఎంత భారీ స్థాయిలో తెరకెక్కిందో అర్థం చేసుకోవచ్చని చెబుతున్నాడు పీవీపీ. ‘వచ్చింది కద అవకాశం..’ పాటతో ఈ సినిమా తెరకెక్కిందని.. ఈ ఒక్క పాటకే కోట్లల్లో ఖర్చయిందని ఆయన వెల్లడించారు.
‘‘2014 విజయదశమి రోజు శ్రీకాంత్ అడ్డాల వచ్చి నానీ కథ చెప్పాడు. కథ చెబుతున్నపుడు ఓ సన్నివేశం దగ్గర షాకయ్యాను. నేను జీవితంలో చేయాలనుకున్న విషయం అందులో కనిపించింది. వెంటనే మహేష్ కు కథ వినిపించాం. ఇంతమంది ఆర్టిస్టులతో ఇంత భారీ సినిమాను తీసి.. అనుకున్న సమయానికి విడుదల చేయడమంటే మామూలు విషయం కాదు. షూటింగ్ ప్రారంభమైన తొలి రోజు రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్లో 624 మంది భోజనాలు చేశారు. అదీ మా సినిమా స్పాన్’’ అని పీవీపీ అన్నారు.
ఇప్పటిదాకా తాను చేసిన సినిమాల షూటింగులకు తాను వెళ్లేవాడిని కాదని.. ఐతే కన్నుల పండువలా సాగిన ‘బ్రహ్మోత్సవం’ షూటింగుకి మాత్రం ప్రతి రోజూ వెళ్లానని పీవీపీ వెల్లడించాడు. ‘‘ఇప్పటి వరకు నా సినిమా అంటే సెట్ కు వెళ్లేవాణ్ని కాదు. తొలి సారి ఈ సినిమాకే అన్ని రోజులూ సెట్లో ఉన్నా. అసలు బ్రహ్మోత్సవం అనేది సినిమా కాదు. నా పాపాయి లాంటిది’’ అని పీవీపీ ఉద్వేగంగా చెప్పాడు.