Begin typing your search above and press return to search.
మహేష్ మంచి ఫ్రెండ్ అయిపోయాడట..
By: Tupaki Desk | 18 May 2016 9:30 AM GMTబ్రహ్మోత్సవం.. సూపర్ స్టార్ మహేష్ నటించిన ఈ భారీ భారీ చిత్రం విడుదలకు మరొక్క రోజు మాత్రమే గ్యాప్ ఉంది. ఇంతకీ రెండుసార్లు భారీ అని ఎందుకు అనాలంటే.. ఒకటి నిర్మాత చేసిన భారీ ఖర్చు కారణంగా అయితే, రెండోది ఇందులో ఉన్న భారీ తారాగణం. ఇంతమంది ఆర్టిస్టులతో ఇంత భారీగా చిత్రాన్ని నిర్మించడం అంటే.. నిర్మాత పీవీపీ చేసిన సాహసంగానే చెప్పాలి.
న్యూక్లియర్ ఫ్యామిలీల రోజుల్లో ఉమ్మడి కుటుంబాల కాన్సెప్ట్ తో సినిమాని తీయడం, అది కూడా మహేష్ లాంటి స్టార్ తో సినిమా చేయడం.. అందరికీ సాధ్యం అయ్యే విషయం కాదు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చెప్పిన స్టోరీ పాయింట్ నచ్చడంతోనే ఇంత ఖర్చు చేసి సినిమా తీశామంటున్నారు పీవీపీ. అలాగే సినిమా నిర్మాణంలో మహేష్ భాగస్వామి కావడం కూడా కలిసొచ్చిన అంశంగా చెబుతున్నారు.
'మహేష్ కి - నాకు మధ్య ప్రొడ్యూసర్- హీరో రిలేషన్ కంటే ఇంకా చాలా ఎక్కువ అనుబంధం ఏర్పడింది. మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. మహేష్ ది కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం. యూనిట్ లో అందరికంటే తనే ఎక్కువగా కష్టపడ్డాడు. వీలైతే మహేష్ తో మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలని ఉంది.' అంటున్నారు పీవీపీ. బ్రహ్మోత్సవం సినిమా చూసి థియేటర్ లోంచి బయటకు వెళ్లే ప్రతీ ప్రేక్షకుడి కంట్లోనూ మెరుపులు కనిపిస్తాయని.. అంత అద్భుతంగా ఈ చిత్రం ఉంటుందని చెబుతున్నారు పీవీపీ.