Begin typing your search above and press return to search.
పెట్టుబడి 10 లక్షలు.. వసూళ్లు రూ.1278 కోట్లు
By: Tupaki Desk | 3 April 2016 5:30 PM GMTగత ఏడాది బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్ల వసూళ్లు సాధించింది. ఆహా ఓహో అనుకున్నాం. కానీ ఆ సినిమా బడ్జెట్ రూ.130 కోట్ల దాకా అయ్యిందన్న సంగతి మరిచిపోతున్నాం. అదే ‘భలే భలే మగాడివోయ్’ సినిమా బడ్జెట్ రూ.6-7 కోట్ల మధ్యే. కానీ ఆ సినిమా రూ.50 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది. ‘బాహుబలి’ ఘనతలు ‘బాహుబలి’కి ఉన్నాయి కానీ.. దాంతో పోలిస్తే ‘భలే భలే మగాడివోయ్’ సినిమాదే పెద్ద విజయం అన్నమాట. ఓ సినిమా ఎంత వసూలు చేసింది అన్నదానికంటే పెట్టుబడి మీద ఎన్ని రెట్ల లాభం వచ్చిందన్నదాన్ని బట్టే ఓ సినిమా విజయాన్ని అంచనా వేయాలి. ఈ లెక్కన చూస్తే ప్రపంచంలో అతి పెద్ద విజయాలు సాధించిన సినిమా అవతార్ కాదు.. జురాసిక్ వరల్డూ కాదు.
లాభాల పరంగా చూస్తే ప్రపంచ సినీ చరిత్రలోనే అతి పెద్ద విజయం సాధించిన సినిమా పేరు.. పారా నార్మల్ యాక్టివిటీ. ఇది రెగ్యులర్ సినిమా కాదు. ఓ ఇండిపెండెంట్ ఫిల్మ్. ఫౌండ్ ఫుటేజ్ విధానంలో హార్రర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా బడ్జెట్ కేవలం 15 వేల డాలర్లు. మన రూపాయల్లో దాదాపు 10 లక్షలన్న మాట. 2009లో విడుదలైన ఈ సినిమా ఒక్క అమెరికాలోనే రూ.715 కోట్లు వసూలు చేయడం విశేషం. ఇతర దేశాల్లో రూ.562 కోట్లు కొల్లగొట్టింది. మొత్తంగా రూ.1278 కోట్లు (193 మిలియన్ డాలర్లు) వసూలు చేసి సంచలనం సృష్టించింది పారానార్మల్ యాక్టివిటీ. అంటే పెట్టుబడి మీద 12,780 రెట్ల వసూళ్లు వచ్చాయన్నమాట. ప్రపంచంలో మరే సినిమా కూడా పెట్టుబడి మీద ఇన్ని రెట్ల వసూళ్లు సాధించలేదు. భవిష్యత్తులో సైతం దీన్ని కొట్టే సినిమా వస్తుందని ఎవ్వరూ అనుకోవట్లేదు.